తెలంగాణ

telangana

By

Published : Jan 21, 2020, 2:46 PM IST

Updated : Feb 17, 2020, 9:01 PM IST

ETV Bharat / sports

'పాస్ మార్కులు తెచ్చుకోవాలంటే రెండు గెలవాల్సిందే'

భారత్​తో సిరీస్​ల్లో తమ జట్టు పాస్ మార్కులు తెచ్చుకోవాలంటే కనీసం రెండు సిరీస్​ల్లోనైనా గెలిచి తీరాలని అంటున్నాడు న్యూజిలాండ్ మాజీ ఆల్​రౌండర్ క్రెయిగ్ మెక్ మిలాన్.

'పాస్ మార్కులు తెచ్చుకోవాలంటే రెండు గెలవాల్సిందే'
కోహ్లీ-విలియమ్సన్

టీమిండియా.. ఈ శుక్రవారం నుంచి కివీస్​తో తలపడనుంది. వారి దేశంలో టెస్టులు, టీ20లు, వన్డేలు ఆడనుంది కోహ్లీసేన. ఇప్పటికే న్యూజిలాండ్ పయనమయ్యారు భారత్ జట్టు సభ్యులు. ఈ నేపథ్యంలో ఈ పర్యటనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కివీస్ మాజీ ఆల్​రౌండర్ క్రెయిగ్ మెక్ మిలన్. పాస్ మార్కులు తెచ్చుకోవాలంటే మూడింట్లో కనీసం రెండైనా నెగ్గాలని తమ జట్టుకు సూచించాడు.

"ప్రస్తుత భారత్ జట్టు ఓ పవర్​హౌస్. ఫార్మాట్​తో సంబంధం లేకుండా వారు అద్భుతంగా రాణిస్తున్నారు. అందువల్ల ఈ సిరీస్​లు చాలా ఆసక్తిగా ఉండబోతున్నాయి. కివీస్ పాస్ మార్కులు తెచ్చుకోవాలంటే మూడింటిలో కనీసం రెండైనా గెలవాలి" -క్రెయిగ్ మెక్ మిలాన్, కివీస్ మాజీ ఆల్​రౌండర్

అదే విధంగా ఈ శుక్రవారం నుంచి ప్రారంభం కాబోతున్న టీ20 సిరీస్​ చాలా ముఖ్యమైనదని అన్నాడు.

న్యూజిలాండ్ మాజీ ఆల్​రౌండర్ క్రెయిగ్ మెక్ మిలాన్

"భారత్-న్యూజిలాండ్ మధ్య ఐదు టీ20లు జరగనున్నాయి. ఇది అందరికీ ఇష్టమైన ఫార్మాట్. ఈ ఏడాది అక్టోబరులో టీ20 ప్రపంచకప్​ జరగనున్న నేపథ్యంలో ఇది మాకు చాలా ముఖ్యమైన సిరీస్​" -క్రెయిగ్ మెక్ మిలాన్, కివీస్ మాజీ ఆల్​రౌండర్

ఇరుజట్ల మధ్య ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు జరగనున్నాయి. ఇటీవలే ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్​ను 0-3తో కోల్పోయిన న్యూజిలాండ్.. భారత్​పై గెలిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Last Updated : Feb 17, 2020, 9:01 PM IST

ABOUT THE AUTHOR

...view details