తెలంగాణ

telangana

ETV Bharat / sports

అదరగొట్టిన భారత బ్యాట్స్​మెన్​.. ఇంగ్లాండ్ లక్ష్యం 318 - first odi

ఇంగ్లాండ్​తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 317 పరుగులు చేసింది. టీమ్​ఇండియా బ్యాట్స్​మెన్​లో విరాట్, ధావన్, కృనాల్, రాహుల్ హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్​ 3, మార్క్ వుడ్ 2 వికెట్లు తీసుకున్నారు.

india vs england
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్

By

Published : Mar 23, 2021, 5:43 PM IST

Updated : Mar 23, 2021, 6:20 PM IST

పుణె వేదికగా ఇంగ్లాండ్​తో జరుగుతున్న తొలి వన్డేలో టీమ్​ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. టాస్​ ఓడి తొలుత బ్యాటింగ్​కు దిగిన భారత్​కు ఓపెనింగ్​ జోడీ శుభారంభం అందించింది. మొదటి వికెట్​కు 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను బెన్​ స్టోక్స్​ విడగొట్టాడు. 16వ ఓవర్​ తొలి బంతికే రోహిత్ శర్మ(42 బంతుల్లో 28) కీపర్​ బట్లర్​కు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు.

ఫామ్​లోకి గబ్బర్​.. హాఫ్ సెంచరీతో విరాట్..

మరో డాషింగ్ ఓపెనర్​ శిఖర్​ ధావన్​(106 బంతుల్లో 98)తో జట్టు కట్టిన కెప్టెన్ విరాట్ కోహ్లీ(60 బంతుల్లో 56) రెండో వికెట్​కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు. మంచి ఇన్నింగ్స్​తో శతకం దిశగా సాగుతున్న కోహ్లీని మార్క్​ వుడ్​ దెబ్బకొట్టాడు. అనవసర షాట్​కు పోయిన విరాట్​.. బౌండరీ వద్ద మొయిన్​​కు చిక్కాడు. కొద్దికాలంగా ఫామ్​లేమితో తంటాలు పడుతున్న గబ్బర్​ ఎట్టకేలకు మంచి టచ్​లో కనిపించాడు. సెంచరీ చేసే క్రమంలో ఒత్తిడికి లోనైన ధావన్​.. స్టోక్స్​ బౌలింగ్​లో క్యాచ్ ఔట్​గా పెవీలియన్​కు చేరాడు.

విరాట్-ధావన్ జోడీ

ఇదీ చదవండి:ఎట్టకేలకు ఫామ్​ అందుకున్న గబ్బర్​

దంచికొట్టిన రాహుల్-కృనాల్​..

శ్రేయస్​ అయ్యర్(6), హార్దిక్ పాండ్య(1) తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. దీంతో భారత్ కనీసం 250 పరుగులైన చేస్తుందా? అన్న సందేహం తలెత్తింది. 40.3 ఓవర్లో 205 వద్ద హార్దిక్​ వికెట్ కోల్పోయిన టీమ్​ఇండియా.. చివరికి 300 పరుగులు దాటిందంటే అది రాహుల్​-కృనాల్ జోడీ వల్లే అని చెప్పాలి. టీ20ల్లో వరుస వైఫల్యాలను చూసిన రాహుల్​.. ఈ మ్యాచ్​తో ఫామ్​లోకి వచ్చాడు. ఇద్దరూ చూడచక్కనైనా షాట్లతో అలరించారు. ఆరో వికెట్​కు ఈ జంట 112 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. మైదానం నలువైపులా షాట్లు కొట్టిన ఈ జంట స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ఇరువురు అర్ధ సెంచరీలు చేసి అజేయంగా నిలిచారు. చివరి పది ఓవర్లలో భారత్ 100కు పైగా రన్స్​ సాధించింది. ​

రాహుల్-కృనాల్ జంట

కృనాల్ అదరహో..

అరంగేట్రం ఆటగాడు కృనాల్​ తొలి మ్యాచ్​లోనే అదరగొట్టాడు. 7 ఫోర్లు, 2 సిక్స్​ల సాయంతో కేవలం 31 బంతుల్లోనే 58 పరుగులతో అజేయంగా నిలిచాడు. మొదటి మ్యాచ్​లోనే హాఫ్​ సెంచరీ చేసిన కృనాల్​.. ఈ ఇన్నింగ్స్​ను తన తండ్రికి అంకితమిచ్చాడు. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ ఈ విషయాన్ని వెల్లడించాడు పాండ్య. ​

కృనాల్ పాండ్య

ఇదీ చదవండి:కోహ్లీ.. ఇంకెన్నాళ్లు ఈ నిరీక్షణ!

Last Updated : Mar 23, 2021, 6:20 PM IST

ABOUT THE AUTHOR

...view details