ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడి జీవించి ఉన్న భారత క్రికెటర్లలో అత్యంత పెద్ద వయస్కుడు వసంత్ రాయ్‌జీ వంద వసంతాలు పూర్తి చేసుకున్నారు. 1940లో తొమ్మిది ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన వసంత్.. 68 అత్యధిక స్కోరుతో 277 పరుగులు చేశారు. టీమిండియా.. బాంబే జింఖానా మైదానంలో తొలి టెస్టు ఆడినప్పటి నుంచి ఇప్పటిదాకా భారత క్రికెట్ ప్రయాణాన్ని చూసిన ఏకైక క్రికెటర్ ఇతను. లాలా అమర్‌నాథ్, విజయ్ మర్చంట్, సీకే నాయుడు, విజయ్ హజారే లాంటి దిగ్గజాలతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్న వసంత్‌ను.. ఇటీవలే సచిన్ తెందుల్కర్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌వా కలిసి అభినందనలు తెలిపారు.
ఫస్ట్‌క్లాస్‌గా '100' కొట్టిన సీనియర్ క్రికెటర్ - sports news
భారత్‌లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడి, జీవించి ఉన్న అతి పెద్ద వయసున్న వ్యక్తిగా నిలిచారు వసంత్ రాయ్‌జీ. తాజాగా ఆయన తన 100వ పుట్టినరోజు జరుపుకున్నారు.
వసంత్ రాయ్‌జీ
ముంబయిలోని వాకేశ్వర్ ప్రాంతంలో నివసిస్తున్న రాయ్‌జీ.. క్రికెట్‌పై కొన్ని పుస్తకాలు కూడా రాశారు. రాయ్‌జీ భార్య పన్నాకు 94 ఏళ్లు. తామిద్దరం ఆరోగ్యంగా ఉన్నామని, తాను వందో పుట్టిన రోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆయన చెప్పారు.
Last Updated : Feb 28, 2020, 2:48 AM IST