తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఆ విషయంలో టీమ్​ఇండియాకు భయం పోయింది' - latest cricket news

టీమ్​ఇండియా బౌలర్లపై ప్రశంసలు కురిపించిన మాజీ పేసర్ షాన్ పొలాక్.. అదనపు బౌలర్​ కోసం ఇబ్బందిపడే రోజులు భారత జట్టుకు పోయాయని వెల్లడించాడు.

India now have quality seam bowling attack: Pollock
షాన్​ పొలాక్

By

Published : Jun 15, 2020, 10:20 AM IST

టీమ్​ఇండియా పేస్​ బౌలింగ్ పూర్తి బలంగా ఉందని​ దక్షిణాఫ్రికా మాజీ పేసర్​ షాన్​ పొలాక్​ చెప్పాడు. అదనపు బౌలర్​ కోసం జట్టు ఇబ్బందిపడే రోజులు పోయాయని, బెంచ్​ విభాగం కూడా బలంగా తయారైందని అన్నాడు. ఇటీవలే ఓ చాట్​షోలో మాట్లాడుతూ ఈ విషయాల్ని పంచుకున్నాడు.

"భారత జట్టు పేస్ విభాగం​ బలంగా తయారైంది. బౌలర్లు వివిధ నైపుణ్యాలతో రాణిస్తున్నారు. పొట్టి, పొడుగు కుర్రాళ్లు ఉండటం వల్ల జట్టు సమతూకంగా తయారైంది"

పొలాక్​, దక్షిణాఫ్రికా మాజీ పేసర్

భారత జట్టు​లో ప్రస్తుతం బుమ్రా, ఇషాంత్​ శర్మ, మహమ్మద్​ షమి, భువనేశ్వర్​ కుమార్​ లాంటి వేగవంతమైన బౌలర్లు అద్భుతంగా అదరగొడుతున్నారు. వీరితో పాటు బెంచ్​లో శార్దుల్​ ఠాకుర్​, దీపక్​ చాహర్​, నవదీప్​ సైనీ తదితరులు సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు.

షాన్​ పొలాక్

అయితే ఒకప్పుడు భారత జట్టులోని శ్రీనాథ్​, వెంకటేశ్ ప్రసాద్ లాంటి​ పేసర్లకు మద్దతుగా అదనపు బౌలర్లు ఉండేవారు కాదని పొలాక్​ గుర్తు చేసుకున్నాడు. ఇటీవలే బుమ్రాతో మాట్లాడిన ఇతడు..​ టీమ్​ఇండియా బౌలర్ల మధ్య పోటీతత్వం పెరిగినట్లు పేర్కొన్నాడు. భారత్​కు ఇది మంచి అవకాశమని అన్నాడు.

ఇదీ చూడండి:గణితంపై అవగాహనే లక్ష్యంగా 'క్రికెట్​-మ్యాథ్'

ABOUT THE AUTHOR

...view details