తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్​కే టెస్టు సిరీస్ గెలిచే అవకాశాలు: గిల్​క్రిస్ట్ - మార్క్​ వా

ఆసీస్​ పర్యటనలో ఉన్న టీమ్​ఇండియా క్రికెటర్లు ఎందుకు గాయపడుతున్నారో వారే స్వయంగా తెలుసుకోవాల్సి ఉందని ఆసీస్​ మాజీ క్రికెటర్​ గిల్​క్రిస్ట్ సూచించాడు​. అలా జరగకుండా జాగ్రత్త పడాలని అన్నాడు. అలానే టెస్టు సిరీస్​ గెలిచే అవకాశాలు పర్యటక జట్టుకు ఉన్నాయని అభిప్రాయపడ్డాడు.

team india
టీమ్ఇండియా

By

Published : Jan 16, 2021, 10:58 AM IST

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్​లో టీమ్​ఇండియా ఆటగాళ్లు వరుసగా గాయపడుతున్నారు. ఇందుకు గల కారణాలను వారే స్వయంగా తెలుసుకోవాల్సిన అవసరముందని ఆసీస్​ మాజీ క్రికెటర్​ గిల్​క్రిస్ట్ అన్నాడు. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశాలున్నాయని చెప్పాడు. గాయాల బారిన పడినప్పటికీ భారత జట్టు తిరిగి పుంజుకున్న విధానం బాగుందని మెచ్చుకున్నాడు.

"ఈ​ పర్యటనలో భారత జట్టు ఎదుర్కొంటోన్న గాయాలు అసాధారణమైనవి. అలా ఎందుకు జరుగుతున్నాయో, అందుకు గల కారణాలను వారు త్వరగా తెలుసుకోవాలి. భారత ఆటగాళ్లకు తగిలిన గాయాల్లో కొన్ని ఆసీస్​ పేస్​ దాడి వల్ల జరిగాయి. మరి మిగతావి? వారు ఈ సమస్యలను నియంత్రించుకోలేకపోతున్నారా? వీటికి సమాధానం టీమ్​ఇండియానే తెలుసుకోవాలి. కానీ మీకు మీరు ఆ ప్రశ్నలు వేసుకోరు. మళ్లీ ఓడిపోకుండా పోరాడుతున్నారు. అది ప్రశంసనీయం. ప్రపంచంలోని ఎన్నో మంచి జట్లు.. మా గడ్డపై టెస్టుల్లో ఓటమిపాలయ్యాయి. ​టీమ్​ఇండియా గబ్బా టెస్టు వరకు చేరడం ఆశ్చర్యంగా ఉంది. ఈ సిరీస్​లో వారు గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి"

-గిల్​క్రిస్ట్​, ఆసీస్​ మాజీ క్రికెటర్​

ఆసీస్​ క్రికెటర్​​ మాథ్యూ వేడ్​ తన ఆటను ఇంకా మెరుగుపరుచుకోవాలని ఆసీస్​ మాజీ ఓపెనర్​ మార్క్​ వా సూచించాడు. ప్రస్తుతం బ్రిస్బేన్​లో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో ఆసీస్​ 369 పరుగులకు ఆలౌట్​ అయింది. ​

ఇదీ చూడండి : గబ్బా​ టెస్టు: తొలి ఇన్నింగ్స్​లో ఆసీస్ 369​ ఆలౌట్​

ABOUT THE AUTHOR

...view details