తెలంగాణ

telangana

ETV Bharat / sports

సౌతాఫ్రికాతో వన్డే, టీ20లకు భారత మహిళా జట్లు ఇవే - south africa vs india

స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే, టీ20 సిరీస్​లకు భారత మహిళల జట్టును ప్రకటించింది యాజమాన్యం. మార్చి 7 నుంచి వన్డే సిరీస్​ ప్రారంభం కానుండగా.. మార్చి 20 నుంచి పొట్టి ఫార్మాట్​ మొదలవుతుంది.

India name ODI and T20I squad for series against South Africa women
సౌతాఫ్రికాతో సిరీస్​లకు భారత మహిళల జట్లు ఇవే

By

Published : Feb 27, 2021, 3:29 PM IST

సొంత గడ్డపై సౌతాఫ్రికాతో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్​లకు భారత మహిళల జట్టును ప్రకటించింది ఆల్​ ఇండియా ఉమెన్స్​ సెలెక్షన్​ కమిటీ. లఖ్​​నవూ వేదికగా మార్చి 7 నుంచి 5 మ్యాచ్​ల వన్డే సిరీస్​ ప్రారంభమవుతుండగా.. మార్చి 20 నుంచి 3 మ్యాచ్​ల టీ20 సిరీస్​ ఆరంభం కానుంది.

ఏక్తా బిష్ఠ్​​, అనుజా పాటిల్, వేద క్రిష్ణమూర్తి, తానియా భాటియా, శిఖా పాండేలకు స్థానం కల్పించలేదు ఎంపిక కమిటీ. ప్రత్యూష, యాస్తిక భాటియా, ఆయూషి సోని, శ్వేత వర్మ, మోనికా పటేల్​, సిమ్రాన్​ దిల్ బహదూర్​లకు తొలిసారి జాతీయ జట్టులో స్థానం కల్పించింది యాజమాన్యం.

వెటరన్ క్రికెటర్​ మిథాలీ రాజ్​ వన్డే జట్టుకు సారథ్యం వహిస్తుండగా.. హర్మన్​ప్రీత్​ కౌర్​ టీ-20 టీంకు కెప్టెన్​గా ఉండనుంది. రెండు ఫార్మాట్లలోనూ వికెట్​ కీపర్​గా సుష్మా వర్మకు అవకాశం కల్పించారు.

వన్డే జట్టు:

మిథాలీ రాజ్​(కెప్టెన్), స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, పూనమ్​ రౌత్, ప్రియా పూనియా, యాస్తికా భాటియా, హర్మన్‌ప్రీత్ కౌర్(వైస్ కెప్టెన్), హేమలత, దీప్తి శర్మ, సుష్మా వర్మ (వికెట్ కీపర్), శ్వేతా వర్మ (వికెట్ కీపర్), రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్​, జులన్ గోస్వామి, మాన్సీ జోషి, పూనం యాదవ్, ప్రత్యూష, మోనికా పటేల్.

టీ20 జట్టు:

హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన(వైస్ కెప్టెన్), షెఫాలి వర్మ, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్, హర్లీన్ డియోల్, సుష్మా వర్మ (వికెట్ కీపర్), నుజాత్ పర్వీన్ (వికెట్ కీపర్), అయుషి సోనీ, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్, మాన్సీ జోషి, మోనికా పటేల్, ప్రత్యుషా, సిమ్రాన్ దిల్ బహదూర్.

ఇదీ చదవండి:పదేళ్ల తర్వాత భారత జిమ్నాస్టిక్స్​ సమాఖ్యకు గుర్తింపు

ABOUT THE AUTHOR

...view details