స్పిన్ ఆల్‌రౌండర్ అశ్విన్‌ను భారత వన్డే జట్టులోకి తిరిగి తీసుకోవాలని సూచించాడు ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రాడ్ హాగ్. యాష్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ చేయగల సమర్థుడని తెలిపాడు.
పరిమిత ఓవర్ల క్రికెట్లో అశ్విన్.. టీమ్ఇండియాకు ఉపయుక్తంగా ఉంటాడని ఓ అభిమాని చేసిన ట్వీట్‌కు హాగ్ స్పందించాడు. "అశ్విన్‌ను జట్టులోకి తీసుకుంటే అదొక గొప్ప ఎంపిక అవుతుంది. అతడు బ్యాటింగ్‌లో కూడా రాణిస్తున్నాడు కాబట్టి ఆ విభాగం బలోపేతమవుతుంది" అని అభిమాని ట్వీట్‌కు సమాధానమిచ్చాడు.
అశ్విన్ తిరిగి వన్డే జట్టులోకి రాగలడా? అని అభిమాని అడిగిన ప్రశ్నకు.. "యాష్ మంచి ఎకానమీతో వికెట్లు తీయగలడు. ఇండియా-ఇంగ్లాండ్ సిరీస్‌కు అతన్ని జట్టులోకి తీసుకోవాలి." అని హగ్ పేర్కొన్నాడు.
ఇప్పటివరకు అశ్విన్ 77 టెస్టులు, 111 వన్డేలతో పాటు 46 టీ20లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో చివరిసారిగా 2017 జూన్‌లో ఆడాడు. గత ఆస్ట్రేలియా సిరీస్‌లో కీలక పాత్ర పోషించిన ఈ ఆఫ్ స్పిన్నర్.. ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లోనూ రాణిస్తున్నాడు.
ఇదీ చదవండి:'వీసాలపై పీసీబీ డిమాండ్ విని ఆశ్చర్యపోయాం'