తెలంగాణ

telangana

కష్టాల్లో టీమిండియా.. 30 పరుగుల తేడాలో నాలుగు వికెట్లు

By

Published : Jan 14, 2020, 4:26 PM IST

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి వన్డేలో భారత బ్యాట్స్​మన్ తడబడ్డారు. 30 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది టీమిండియా.

india
ధావన్

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మొదటి వన్డేలో భారత బ్యాట్స్​మెన్ సునాయస క్యాచ్​లతో పెవిలియన్ చేరుతున్నారు. ఇప్పటికే ఓపెనర్ రోహిత్ శర్మ సులభమైన క్యాచ్ ఇచ్చి ఔటవగా.. వన్​డౌన్​లో వచ్చిన కేఎల్ రాహుల్ (47) స్టీవ్ స్మిత్​కు ఇలాంటి క్యాచ్ ఇచ్చే పెవిలియన్ చేరాడు. తద్వారా మూడు పరుగుల తేడాతో అర్ధసెంచరీని మిస్సయ్యాడు.

ఓపెనర్‌ ధావన్‌ అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. 66 బంతుల్లో 8 ఫోర్లతో హాఫ్‌ సెంచరీ చేశాడు. అనంతరం 74 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మూడో వికెట్‌గా వెనుదిరిగాడు.మరో 16 పరుగులు చేశాక.. జట్టు స్కోరు 156 పరుగుల వద్ద కెప్టెన్ కోహ్లీ (16) ఆడమ్ జంపా బౌలింగ్​లో వెనుదిరిగాడు. అనంతరం మరో 12 పరుగుల తేడాలో శ్రేయస్ అయ్యర్ (4) పెవిలియన్ చేరి టీమిండియా శిబిరంలో ఆందోళన నింపాడు. ఫలితంగా 30 పరుగుల తేడాలో నాలుగు కీలక వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది కోహ్లీసేన. ప్రస్తుతం పంత్, రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నారు.

ఇవీ చూడండి.. దాదా, భజ్జీ స్టెప్పులు.. అభిమానులు ఫిదా

ABOUT THE AUTHOR

...view details