తెలంగాణ

telangana

ETV Bharat / sports

వన్డే సూపర్​ లీగ్​లో ఖాతా తెరిచిన టీమ్​ఇండియా

ఐసీసీ పురుషుల క్రికెట్​ వరల్డ్​ కప్​ లీగ్​లో భారత్ ఖాతా తెరిచింది. ఆసీస్​తో చివరి వన్డేలో గెలిచి 10 పాయింట్లు సాధించింది. అయితే.. తొలి వన్డేలో స్లో ఓవర్​ రేటు కారణంగా ఒక పాయింట్​ను చేజార్చుకుంది. ఆస్ట్రేలియా ఈ పాయింట్ల పట్టికలో టాప్​లో ఉంది.

ODI Super League
స్లో ఓవర్​ రేటుతో పాయింట్ కోల్పోయిన టీమ్​ఇండియా

By

Published : Dec 2, 2020, 9:27 PM IST

ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో టీమ్​ఇండియా గెలుపొందినా.. సిరీస్​ను చేజార్చుకుంది. ఈ విజయంతో.. ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్ కప్​ సూపర్ లీగ్ పాయింట్ల ఖాతా తెరిచింది. కానీ, మొదటి వన్డేలో స్లో ఓవర్ రేటు​ కారణంగా భారత్​కు రావాల్సిన 10 పాయింట్లలో ఒకదాన్ని కోల్పోయి 9 పాయింట్లను దక్కించుకుంది.

వరల్డ్​ కప్ సూపర్ లీగ్ పాయింట్ల ఖాతా తెరిచిన భారత్

ఈ సూపర్​ లీగ్ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా 40 పాయింట్లతో టాప్​లో నిలిచింది. 2-1 తేడాతో భారత్​ను ఓడించిన తర్వాత ఆసీస్​ తొలిస్థానానికి ఎగబాకింది. అంతకుముందు ఇంగ్లాండ్​ను 2-1తో ఓడించింది.

ఈ సిరీస్​లో మొదటి వన్డే​ తర్వాత స్లో ఓవర్ రేటు​ కారణంగా భారత ఆటగాళ్లందరికీ మ్యాచ్​ ఫీజులో 20 శాతం కోత విధించనున్నట్లు ఐసీసీ అప్పుడు ప్రకటించినా.. పాయింట్ల తగ్గింపు విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు.

పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచిన ఆస్ట్రేలియా

ఐర్లాండ్​పై 2-1తేడాతో గెలిచిన ఇంగ్లాండ్ 30 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. పాకిస్థాన్​ 20 పాయింట్లతో తర్వాతి స్థానంలో ఉంది.

వన్డే సూపర్​ లీగ్​ ఏంటి..?

2023 వన్డే ప్రపంచకప్​లో అర్హత కోసం.. ఈ ఏడాది జులై 30 నుంచి ఈ సూపర్​ లీగ్​ను ప్రారంభించారు. ఇంగ్లాండ్​-ఐర్లాండ్​ మధ్య తొలి మ్యాచ్​ జరిగింది.

ఐసీసీ శాశ్వత సభ్యదేశాలైన 12 జట్లతో పాటు నెదర్లాండ్స్​​ ఈ సూపర్​ లీగ్​లో పాల్గొంటాయి. ఈ లీగ్‌లోని 13 జట్లు 8ప్రత్యర్థి జట్లతో సిరీస్​లు​(స్వదేశంలో 4, విదేశాల్లో 4)ఆడాల్సి ఉంటుంది. తొలి ఏడు స్థానాల్లో నిలిచిన జట్లు, ఆతిథ్య భారత్‌ నేరుగా 2023 ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి. అడుగున నిలిచిన ఐదు జట్లు ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌ ఆడతాయి.

ఇదీ చదవండి:నా చేతులు మళ్లీ దారిలోకి వచ్చాయి: స్టీవ్ స్మిత్

ABOUT THE AUTHOR

...view details