తెలంగాణ

telangana

ETV Bharat / sports

టెస్టుల్లో జోరు చూపేందుకు కోహ్లీసేన రె'ఢీ'..! - vrat kohli

వెస్టిండీస్​తో జరిగిన టెస్టు సిరీస్​లో నెగ్గి ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​లో శుభారంభం చేసింది టీమిండియా. 120 పాయింట్లు ఖాతాలో వేసుకుని ఇదే జోరును దక్షిణాఫ్రికా సిరీస్​లోనూ కొనసాగించాలనుకుంటోంది.

విరాట్ కోహ్లీ

By

Published : Oct 1, 2019, 5:31 AM IST

Updated : Oct 2, 2019, 5:01 PM IST

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​లో పాయింట్లు పెంచుకునే దిశగా ముందుకు సాగుతోంది టీమిండియా. ఇప్పటికే వెస్టిండీస్​తో జరిగిన టెస్టు సిరీస్​ను కైవసం చేసుకున్న కోహ్లీసేన అదే జోరును దక్షిణాఫ్రికా సిరీస్​లోనూ చూపించాలనుకుంటుంది.

కరీబియన్లపై 2-0 తేడాతో నెగ్గి 120 పాయింట్లు ఖాతాలో వేసుకుంది టీమిండియా. ఇలాంటివి మరో మూడు సిరీస్​లు ఆడనున్న ఏకైక జట్టు కోహ్లీసేనే. రెండు మ్యాచ్​ల సిరీస్​ను డ్రా చేసుకున్న శ్రీలంక - న్యూజిలాండ్ చెరో 60 పాయింట్లు దక్కించుకున్నాయి. 5 మ్యాచ్​ల యాషెస్​ సిరీస్​ను డ్రా చేసుకున్న ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా చెరో 56 పాయింట్లు పొందాయి.

విశాఖపట్టణం వేదికగా అక్టోబర్ 2న భారత్ - దక్షిణాఫ్రికా మధ్య మొదటి టెస్టు జరగనుంది. రెండోది పుణెలో, మూడో టెస్టు రాంచీ వేదికగా నిర్వహించనున్నారు. ఈ మూడు టెస్టుల సిరీస్​లో మ్యాచ్​కు 40 పాయింట్లు చొప్పున గెలిచిన జట్టు ఖాతాలో చేరతాయి. ఈ రకంగా 120 పాయింట్లు వస్తాయి.

ప్రొటీస్ జట్టుపై సిరీస్​ నెగ్గి తన పాయింట్లను 240కు పెంచుకుందామని చూస్తోంది కోహ్లీసేన. ఓడితే 120 పాయింట్లతో ఇరు జట్లు టాప్​-2లో ఉంటాయి. ఈ విధంగా ప్రతి మ్యాచ్​లో గెలుస్తూ పాయింట్లతో ముందు వరుసలో ఉన్న రెండు జట్ల మధ్య 2021 జూన్​లో టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​ మ్యాచ్ జరగనుంది.

ఇదీ చదవండి: హరియాణా ఎన్నికల దంగల్​ పోటీలో క్రీడాకారులు

Last Updated : Oct 2, 2019, 5:01 PM IST

ABOUT THE AUTHOR

...view details