వెస్టిండీస్‌తో తొలి వన్డేలో పరాజయానికి బదులు చెప్పాలని చూస్తోంది టీమిండియా. రెండో వన్డేలోనూ విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలనుకుంటోంది విండీస్. విశాఖ వేదికగా ఇరు జట్ల మధ్య నేడు ఆరంభం కానుంది.
గత 15 ఏళ్ల నుంచి సొంతగడ్డపై వరుసగా రెండు ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ల్లో టీమిండియా ఒక్కసారి కూడా ఓడలేదు. చివరగా 2002-03లో విండీస్‌పై, 2004-15లో పాకిస్థాన్‌పై పరాజయం పాలైంది. అంతేకాకుండా స్వదేశంలో వరుసగా 5 వన్డేల్లోనూ ఇప్పటివరకు ఓటమి పాలవ్వలేదు. ఈ రోజు విశాఖలో జరిగే వన్డేలో భారత్ పరాజయం చెందితే ఈ రికార్డులు బద్దలు కానున్నాయి.
ఈ ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన 5వన్డేల సిరీస్‌లో 2-3 తేడాతో ఓడింది కోహ్లీసేన. చెన్నై వన్డేలో పరాజయంతో స్వదేశంలో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది.