తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్​దే రోడ్​ సేఫ్టీ సిరీస్​.. ఫైనల్లో లంకపై విజయం - road safety series

రోడ్​ సేఫ్టీ సిరీస్​ను భారత్​ లెజెండ్స్ కైవసం చేసుకుంది. ఫైనల్లో శ్రీలంక లెజెండ్స్​పై 14 పరుగుల తేడాతో విజయం సాధించింది సచిన్ సేన. భారత బౌలర్లలో పఠాన్​ సోదరులు మెరుగైన ప్రదర్శన చేశారు. చెరో రెండు వికెట్లు తీసి ప్రత్యర్థిని నిలువరించారు.

India Legends win Road Safety Series
రోడ్​ సేఫ్టీ సిరీస్​ భారత్ కైవసం.. ఫైనల్లో లంకపై విజయం

By

Published : Mar 21, 2021, 11:08 PM IST

రోడ్​ సేఫ్టీ సిరీస్​ టైటిల్​ను ఇండియా లెజెండ్స్​ గెల్చుకుంది. ఫైనల్లో శ్రీలంక లెజెండ్స్​ టీంపై.. సచిన్​ సేన 14 పరుగుల తేడాతో విజయం సాధించింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్​కు దిగిన ఇండియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. యువరాజ్​ సింగ్​ (41 బంతుల్లో 60 పరుగులు), యూసుఫ్ పఠాన్ (36 బంతుల్లో 62 పరుగులు) విధ్వంసానికి తోడు ఓపెనర్​ సచిన్​ (30) ఆకట్టుకునే ప్రదర్శన చేశారు.

అనంతరం 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక లెజెండ్స్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులే చేసింది. లంక జట్టులో సనత్ జయసూర్య (35 బంతుల్లో 43 పరుగులు), జయసింఘే (30 బంతుల్లో 40), వీరరత్నే (15 బంతుల్లో 38) రాణించారు. భారత బౌలర్లలో యూసుఫ్ పఠాన్ 2/26, ఇర్ఫాన్​ పఠాన్ 2/29 పొదుపుగా బౌలింగ్ చేశారు. కీలక సమయంలో వికెట్లు తీశారు.

ఇదీ చదవండి:ఉత్కంఠ పోరులో ఆఖరి బంతికి దక్షిణాఫ్రికా విజయం

ABOUT THE AUTHOR

...view details