ప్రపంచ క్రికెట్లో సత్తాచాటి దిగ్గజాలుగా పేరుగాంచిన సచిన్ తెందూల్కర్, లారా, జాంటీ రోడ్స్‌తో పాటు పలువురు మాజీ క్రికెటర్లు మరోసారి మైదానంలో సందడి చేయనున్నారు. రోడ్డు భద్రతా అవగాహన (రోడ్ సేఫ్టీ అవేర్నెస్) కార్యక్రమంలో భాగంగా జరిగే టీ20 ఎగ్జిబిషన్ టోర్నీలో వీరు పాల్గొననున్నారు. ఈ టోర్నీలో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ దేశాలకు చెందిన దిగ్గజ ఆటగాళ్లు మరోసారి తమ ఆటతో ప్రేక్షకుల్ని మైమరిపించనున్నారు. తాజాగా ఇందులో పాల్గొనే జట్లను ప్రకటించారు. ఇండియా లెజెండ్స్‌కు సచిన్ సారథ్యం వహించనున్నాడు.
ఇండియా లెజెండ్స్
సచిన్ తెందూల్కర్ (కెప్టెన్), వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్, అజిత్ అగార్కర్, సంజయ్ బంగర్, మునాఫ్ పటేల్, మహ్మద్ కైఫ్, ప్రజ్ఞాన్ ఓజా, సైరాజ్ బహుతులే, సమీర్ దిఘే (వికెట్ కీపర్)
ఆస్ట్రేలియా లెజెండ్స్
బ్రెట్‌లీ (కెప్టెన్), బ్రాడ్ హాడ్జ్, బ్రెట్ గీవ్స్, క్లింట్ మెక్కే, జార్జ్ గ్రీన్, జాసన్ క్రేజా, మార్క్ కాస్గ్రోవ్, నాథన్ రీర్డన్, రాబ్ క్వినే, షేన్ లీ, ట్రెవిస్ బర్ట్, గ్జేవియర్ దోహర్టీ
వెస్టిండీస్ లెజెండ్స్