కరీబియన్లతో టెస్టు సిరీస్‌కు ముందు వెస్టిండీస్-ఏ జట్టుతో మూడు రోజుల ప్రాక్టీసు మ్యాచ్ ఆడుతోంది టీమిండియా. కూలిడ్జ్ వేదికగా శనివారం ప్రారంభమైంది. ఇందులో నూతన టెస్టు జెర్సీల్లో దర్శనమిచ్చారు భారత ఆటగాళ్లు. ఆ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది భారత్ క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).
కొత్త టెస్టు జెర్సీల్లో టీమిండియా క్రికెటర్లు - పుజారా
వెస్టిండీస్-ఏ జట్టుతో జరుగుతున్న ప్రాక్టీసు మ్యాచ్‌లో టీమిండియా క్రికెటర్లు కొత్త జెర్సీలతో దర్శనమిచ్చారు. ఈ మ్యాచ్‌లో పుజారా సెంచరీ, రోహిత్ అర్ధ సెంచరీ చేశారు.
కొత్త టెస్టు జెర్సీల్లో టీమిండియా క్రికెటర్లు
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. తొలిరోజు ఆటముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. చతేశ్వర్ పుజారా శతకం చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. రోహిత్ శర్మ(68) అర్ధశతకంతో రాణించాడు. క్రీజులో హనుమ విహారి(37), రవీంద్ర జడేజా(1) ఉన్నారు. వెస్టిండీస్ బౌలర్లలో కార్టర్ మూడు వికెట్లు దక్కించుకున్నాడు. హోర్డింగ్, ఫ్రాజర్ తలో వికెట్ తీశారు.
ఇది చదవండి: వైరల్: ఆర్మీ దుస్తుల్లో ధోనీ క్రికెట్
Last Updated : Sep 27, 2019, 9:20 AM IST