ఇండియన్ ప్రీమియర్ లీగ్-13వ సీజన్ గురించి మాట్లాడాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ. ఈ మెగాటోర్నీ జరగకుండా ఈ ఏడాది ముగియదని చెప్పాడు. కచ్చితంగా లీగ్ జరిగి తీరుతుందని అన్నాడు. దేశంలో కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో టోర్నీని విదేశాల్లో నిర్వహించే అవకాశం ఉందని ఇటీవల ఓ బీసీసీఐ అధికారి అన్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన దాదా.. భారత్ తమ తొలి ప్రాధాన్యమని, ఆ తర్వాతే విదేశాల్లో అని పేర్కొన్నాడు.
"ఈ ఏడాది ఐపీఎల్ కచ్చితంగా జరుగుతుంది. భారత్లో నిర్వహించడమే మా తొలి ప్రాధాన్యత. 35-40 రోజుల సమయం దొరికినా టోర్నీని నిర్వహిస్తాం. కానీ ఎక్కడనేది మాత్రం ఇప్పుడే చెప్పలేం"
-గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు