తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ప్రపంచకప్​లో టీమిండియానే ఫేవరెట్' - ప్రపంచకప్​

త్వరలో ఆరంభమయ్యే ప్రపంచకప్​లో టీమిండియా కప్పు కొడుతుందన్నాడు మాజీ కెప్టెన్ అజారుద్దీన్. ప్రతి భారత క్రికెటర్ బాగా ఆడాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.

'ప్రపంచకప్​లో టీమిండియానే ఫేవరెట్'

By

Published : May 16, 2019, 10:46 AM IST

'త్వరలో జరగనున్న క్రికెట్ వన్డే ప్రపంచకప్​లో భారత జట్టే ఫేవరెట్'.... చాలా మంది మాజీల చెపుతున్న మాటే ఇది. ఇప్పుడా జాబితాలోకి టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ చేరాడు. కప్పు గెలిచే సత్తా కోహ్లీ సేనకు ఉందని విశ్లేషించాడు.

టీమిండియా జట్టు

"టీమిండియాకు ఇదే మంచి అవకాశం. మనకు మంచి జట్టుంది. అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. ఇంగ్లండ్ పిచ్‌లతో మనకు ఇబ్బంది కలుగుతుందని చాలామంది అంటున్నారు. మన బౌలర్లకు ప్రత్యర్థిని ఆలౌట్‌ చేయగల సత్తా ఉంది. పేస్, స్పిన్ విభాగం దుర్భేద్యంగా ఉంది. ఈ జట్టుతో ప్రపంచకప్‌ గెలవకపోతే నిరాశపడతాను. ప్రపంచకప్‌లో తొలి ప్రాధాన్యం టీమిండియాకే. తర్వాత స్థానాలను ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాకు ఇస్తా. భారత జట్టుకు ఆల్ ద బెస్ట్ చెపుతున్నా. ప్రతి ఆటగాడు బాగా రాణించాలని ఆశిస్తున్నా' -అజారుద్దీన్‌, టీమిండియా మాజీ కెప్టెన్

భారత క్రికెట్ జట్టు తరఫున 99 టెస్టుల్లో 6,215 పరుగులు, 334 వన్డేల్లో 9,378 పరుగులు చేశాడీ దిగ్గజ క్రికెటర్.

ఇంగ్లండ్​-వేల్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రపంచకప్​లో జూన్ 5న దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్​ ఆడనుంది టీమిండియా.

ABOUT THE AUTHOR

...view details