చెన్నై వేదికగా ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో జరగనున్న తొలి రెండు టెస్టులకు ప్రేక్షకులను అనుమతించడంలేదని తమిళనాడు క్రికెట్ సంఘం(టీఎన్‌సీఏ) కార్యదర్శి రామస్వామి తెలిపారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన శుక్రవారం వెల్లడించారు.
భారత్‌లో ఇంగ్లాండ్ పర్యటన ఫిబ్రవరి 5 నుంచి జరగనున్న తొలి టెస్టుతో ప్రారంభంకానుంది. దానితో పాటు ఫిబ్రవరి 13న మొదలయ్యే రెండో మ్యాచ్ కూడా చెన్నైలోని ఎంఏ చిదంబరం మైదానంలోనే జరగనుంది.
"తొలి రెండు టెస్టులకు ప్రేక్షకులను అనుమతించడం లేదు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాం."