ఇటీవల ముగిసిన ఇండియా-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్.. ఓ సరికొత్త రికార్డును నమోదు చేసింది. గత ఐదేళ్లలో అత్యధిక మంది వీక్షించిన సిరీస్‌గా ఇది రికార్డులు నెలకొల్పింది. నిమిషానికి సగటున 13 లక్షల మంది ఈ టెస్టు మ్యాచ్‌లను చూసినట్లు వెల్లడైంది. 2019లో ఓ టెస్టు మ్యాచ్‌కు ప్రారంభ రోజు అత్యధిక వీక్షణలు వచ్చాయి.
సుదీర్ఘ ఫార్మాట్‌కు పెరుగుతున్న ఆదరణకు ఈ వీక్షణల సంఖ్యే నిదర్శనం. దీంతో పాటు తొలిసారిగా ప్రవేశపెట్టిన టెస్టు ఛాంపియన్షిప్ కూడా దీనికి మరో కారణం. ఈ టెస్టు సిరీస్‌ను మొత్తం 10కోట్ల 30 లక్షల మంది చూసినట్లు వెల్లడైంది.