తెలంగాణ

telangana

ETV Bharat / sports

షూటింగ్​ ప్రపంచకప్​లో భారత్ అగ్రస్థానం ​

షూటింగ్​ ప్రపంచకప్​లో భాగంగా చివరి రోజును భారత షూటర్లు మరో రెండు స్వర్ణాలతో ముగించారు. ఫలితంగా 30 పతకాలతో భారత్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఏప్రిల్​ 3 లేదా ఏప్రిల్​ 4న ఒలింపిక్స్​కు అర్హత సాధించిన షూటర్ల పేర్లను ప్రకటించనున్నట్లు భారత షూటింగ్​ అసోసియేషన్​ అధ్యక్షుడు రణీందర్​ సింగ్​ తెలిపారు.

shooting
షూటింగ్​

By

Published : Mar 28, 2021, 9:09 PM IST

షూటింగ్‌ ప్రపంచకప్‌ను భారత్‌ అగ్రస్థానంతో ముగించింది. చివరి రోజు భారత షూటర్లు మరో రెండు స్వర్ణాలు సాధించారు. పురుషుల షాట్ గన్ విభాగంలో పృథ్వీరాజ్‌ తొండైమన్‌, లక్షయ్‌ షెరోన్‌, కెనాన్‌ చెనాయ్‌ బృందం స్వర్ణం సాధించింది.

అంతకుముందు మహిళల ట్రాప్ విభాగం ఫైనల్‌లో శ్రేయాసి సింగ్‌, రాజేశ్వరి కుమారి, మనీశా కీర్‌లు కజకిస్థాన్‌పై 6-0 తేడాతో విజయం సాధించి పసిడి పతకం ఒడిసిపట్టారు. ఈ ప్రపంచకప్‌లో ఆది నుంచి ఆధిపత్యంలోనే ఉన్న భారత్‌ 30 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. వీటిలో 15 స్వర్ణాలే ఉండగా 9 వెండి, ఆరు కాంస్య పతకాలు ఉన్నాయి.

ఏప్రిల్​ 3 లేదా ఏప్రిల్​ 4న ఒలింపిక్స్​కు అర్హత సాధించిన షూటర్ల పేర్లను ప్రకటించనున్నట్లు భారత షూటింగ్​ అసోసియేషన్ అధ్యక్షుడు రణీందర్​ సింగ్ తెలిపారు​.

ఇదీ చూడండి:'ఒలింపిక్స్​లో షూటింగ్​పైనే భారీ అంచనాలు'

ABOUT THE AUTHOR

...view details