గతేడాది జరిగిన ప్రపంచకప్‌లో టీమ్ఇండియా జట్టు సెలక్షన్ సరిగా లేకపోవడం ఓటమికి ప్రధాన కారణమని అంటున్నాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా. ఆ టోర్నీ కోసం సరైన ఆటగాళ్లను ఎంపిక చేయలేదని స్పష్టం చేశాడు. 2011 ప్రపంచకప్ జట్టుతో పోలిస్తే 2019లో టీమ్ఇండియా మెరుగ్గా ఉన్నా.. రాణించలేకపోయిందని తెలిపాడు.
"2019 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా పరాజయం చెందడానికి కారణం జట్టు ఎంపిక సరిగా లేకపోవడమే. మిడిల్ ఆర్డర్ చాలా బలహీనంగా, గెలవడానికి వీలు లేకుండా ఉంది. జట్టులో మహ్మద్ షమీని ఉంచాల్సింది. కానీ అతడ్ని ఆడనివ్వలేదు. శిఖర్ ధావన్ గాయపడితే అతడి ప్రత్యామ్నాయాన్ని టీమ్‌లో చేర్చలేకపోయారు. మీరు గమనిస్తే 2011లో ఆడిన జట్టు కంటే 2019 జట్టు మెరుగ్గా ఉన్నా ఆటగాళ్ల ఎంపిక సరిగా లేకపోవడం వల్ల ట్రోఫీ చేజారింది." -ఆకాష్ చోప్రా, టీమ్ఇండియా మాజీ క్రికెటర్