తెలంగాణ

telangana

ETV Bharat / sports

ముగిసిన భారత తొలి ఇన్నింగ్స్​... 502/7 డిక్లేర్​

విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ 502/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. మయాంక్(215), రోహిత్(176) శతకాలతో చేలరేగి టీమిండియా భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించారు.

మయాంక్ అగర్వాల్

By

Published : Oct 3, 2019, 4:29 PM IST

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ 502/7 స్కోరు వద్ద డిక్లేర్ ఇచ్చింది. విశాఖ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్​లో ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(215), రోహిత్ శర్మ(176) శతకాలు చేయడం వల్ల టీమిండియా భారీ స్కోరు సాధించింది. ప్రొటీస్ బౌలర్లలో కేశవ్ మహరాజ్ 3 వికెట్లు తీయగా ఫిలాండార్, డేన్, సెనురన్ ముత్తుసామి తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

మయాంగ్ అగర్వాల్

202 పరుగుల ఓవర్​నైట్ స్కోరు వద్ద రెండో రోజు బ్యాటింగ్ ఆరంభించిన భారత ఓపెనర్లు... మరో వంద పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మయాంక్ అగర్వాల్ ద్విశతకంతో కదం తొక్కగా.. రోహిత్ శర్మ 176 పరుగులతో రాణించాడు. వీరిద్దరూ తొలి వికెట్​కు 317 పరుగులు జోడించారు. హిట్​మ్యాన్​ను ఔట్ చేసి వీరిద్దరి పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేశాడు కేశవ్ మహారాజ్​.

మయాంక్ - రోహిత్

రోహిత్ ఔటైనా మయాంక్ బ్యాటింగ్​ జోరు తగ్గలేదు. నిలకడగా ఆడుతూ కెరీర్​లో తొలి ద్విశతకం నమోదు చేశాడు. 358 బంతుల్లో 200 పరుగులు పూర్తి చేశాడు. ఇందులో 23 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. రోహిత్ శర్మ కూడా ఇన్నే బౌండరీలు సాధించడం విశేషం.

మిగతా బ్యాట్స్​మెన్లు పుజారా(6) ఫిలాండర్​ బౌలింగ్​లో ఔటవ్వగా.. కోహ్లీ(20) పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. వేగంగా పరుగులు చేసే క్రమంలో రహానే(15), హనుమ విహారి(10) తక్కువ పరగులకే వెనుదిరిగారు. చివర్లో జడేజా(30), సాహా(21) ధాటిగా ఆడి స్కోరు 500 దాటడంలో కీలకపాత్ర పోషించారు.

ఇదీ చదవండి: బెన్​స్టోక్స్​.. 'ప్లేయర్​ ఆఫ్​ ద ఇయర్​'

ABOUT THE AUTHOR

...view details