కరోనా వల్ల క్రీడాటోర్నీలన్నీ వాయిదా పడ్డాయి. ఈ కారణంగా ఆటగాళ్లందరూ ఇంటికే పరిమితమయ్యారు. టీమ్ఇండియా క్రికెటర్లు కూడా ఇంటివద్దే ఉంటూ సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. ఈ విరామ సమయంలో ఆటగాళ్లకు శిక్షణ మాత్రం కరవైంది. మళ్లీ బరిలోకి దిగాలంటే కచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిందే. ఇదే విషయమై తాజాగా స్పందించాడు భారత జట్టు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్.
"ఒక ప్రొఫెషనల్ క్రీడాకారుడిగా ఇంట్లో ఖాళీగా కూర్చోవడం బోరింగ్‌గా ఉంటుంది. అయితే మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్ ఆడాలంటే ఆటగాళ్లకు కనీసం ఆరు నుంచి ఎనిమిది వారాల ప్రాక్టీస్ అవసరం. మేనేజ్మెంట్ కూడా అదే ఆలోచిస్తోంది. ఆటగాళ్లందరికీ నైపుణ్యవంతమైన శిక్షణను అందిస్తాం"