తెలంగాణ

telangana

ETV Bharat / sports

కివీస్​తో ఓటమికి కారణం అదే: కోహ్లీ - కివీస్​తో ఓటమికి కారణం అదే: కోహ్లీ

న్యూజిలాండ్​తో జరిగిన తొలి టెస్టులో ఓటమిపాలైంది టీమిండియా. అయితే పరాజయంపై స్పందించిన భారత జట్టు సారథి కోహ్లీ.. తొలి ఇన్నింగ్స్​లో తక్కువ స్కోర్ చేయడమే కొంపముంచిందని తెలిపాడు.

కోహ్లీ
కోహ్లీ

By

Published : Feb 24, 2020, 11:33 AM IST

Updated : Mar 2, 2020, 9:25 AM IST

న్యూజిలాండ్​తో జరిగిన తొలి టెస్టులో ఘోర వైఫల్యాన్ని మూటగట్టుకుంది టీమిండియా. 10 వికెట్ల తేడాతో ఓడిపోయి సిరీస్​లో 0-1 తేడాతో వెనకపడింది. అయితే మ్యాచ్ అనంతరం మాట్లాడిన భారత జట్టు సారథి విరాట్ కోహ్లీ తొలి ఇన్నింగ్స్​లో బ్యాటింగ్ వైఫల్యమే కొంపముంచిందని అభిప్రాయపడ్డాడు.

"మేం 220-230 స్కోర్‌ చేసినా సరిపోయేది కాదు. తొలి ఇన్నింగ్స్‌లో చేసిన తక్కువ పరుగులే మ్యాచ్‌లో మేం వెనుకపడేలా చేశాయి. అలాగే కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించి భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. అయితే, పృథ్వీషా విషయంలో తొందరపడాల్సిన అవసరం లేదు. అతను ఓవర్‌సీస్‌లో ఆడింది రెండు టెస్టులే కాబట్టి భవిష్యత్‌లో కచ్చితంగా రాణిస్తాడు. అలాగే మయాంక్‌ అగర్వాల్‌ ఒక్కడే రహానె తర్వాత బ్యాటింగ్‌లో నిలకడగా రాణించాడు. మా బౌలర్లు రాణించేందుకు వారి ముందు పెద్ద స్కోర్‌ ఉంచాల్సింది కానీ, ఈ మ్యాచ్‌లో మేం అదే చేయలేకపోయాం. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌ ఆధిక్యాన్ని 100లోపే కట్టడి చేయాలనుకున్నాం. చివరి మూడు వికెట్లు తీయడంలో బౌలర్లు విఫలమయ్యారు.

-విరాట్ కోహ్లీ, టీమిండియా సారథి

టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌటైంది. అంతకుముందు కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 348 పరుగులు చేసింది. ఫలితంగా ఆ జట్టుకు 183 పరుగుల ఆధిక్యం లభించగా.. రెండో ఇన్నింగ్స్‌లో మరో తొమ్మిది పరుగులు చేసి 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో కోహ్లీసేన ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో తొలి ఓటమిని చవిచూసింది.

Last Updated : Mar 2, 2020, 9:25 AM IST

ABOUT THE AUTHOR

...view details