మహిళల టీ20 ప్రపంచకప్ ముద్దాడేదెవరో తెలిసేందుకు కొన్ని గంటల సమయమే ఉంది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ.. ఎంతో మంది క్రికెటర్ల ఆశ.. ఆస్ట్రేలియా గడ్డపై ఆ ట్రోఫీని ముద్దాడాలని భావిస్తోంది భారత్. పొట్టి ప్రపంచకప్‌లో తొలిసారి ఫైనల్‌కు చేరిన టీమిండియా.. నాలుగు సార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాతో నేడు తలపడనుంది. భారత జట్టుకు కెప్టెన్సీ వహిస్తున్న హర్మన్‌కు ఈ రోజు చాలా ప్రత్యేకం. ఎందుకంటే ప్రపంచ మహిళా దినోత్సవమే కాకుండా ఆమె పుట్టినరోజు కావడం. అందుకే ఈ విజయం ఆమెకే కాదు దేశానికి ఎంతో ప్రత్యేకం.
ఇలాంటి ప్రముఖమైన ఫైనల్లో హర్మన్ ఆటను చూసేందుకు తొలిసారి దేశాలు దాటి ఆస్ట్రేలియాకు వెళ్లింది హర్మన్ తల్లి సతీందర్ కౌర్. గెలుపైనా, ఓటమైనా వెన్నంటి నిలిచేందుకు నేనున్నా అంటూ అభయమిచ్చింది.