తెలంగాణ

telangana

ETV Bharat / sports

'టీ20 ప్రపంచకప్​లో ధోనీ ఆడటం ముఖ్యమేమి కాదు' - dhoni reentry in t20 world cup

వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్​లో భారత సీనియర్​ బ్యాట్స్​మన్​​ మహేంద్ర సింగ్​ ధోనీ ఆడకపోయినా టీమిండియా సత్తా చాటగలదని అభిప్రాయపడ్డాడు మాజీ క్రికెటర్​ ఆకాశ్​చోప్రా. జట్టుకు మహీ ప్రాతినిధ్యం వహించడం అంత ముఖ్యమేమి కాదని అన్నాడు.

MS Dhoni
ధోనీ

By

Published : Aug 12, 2020, 6:44 PM IST

జాతీయ జట్టులోకి మాజీ సారథి మహేంద్ర సింగ్​ ధోనీ పునరాగమనంపై మాట్లాడాడు మాజీ క్రికెటర్​ ఆకాశ్​ చోప్రా. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్​లో మహీ ఆడకపోయినా టీమిండియా మెరుగైన ప్రదర్శన కనబరుస్తుందని అభిప్రాయపడ్డాడు.

"ధోనీ లేకపోయినా టీమిండియా బాగానే రాణించగలదు. అయితే మహీ ఆడటం జట్టుకు లాభదాయకమే. కానీ టీమ్​ మేనేజ్​మెంట్​ కూడా అతడికి ఆడాలని ఉందో లేదో తెలుసుకోవాలి.

-ఆకాశ్​ చోప్రా, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​.

గతేడాది ప్రపంచకప్​లో చివరగా బరిలోకి దిగిన ధోనీ.. ఆ తర్వాత ఐపీఎల్​లో ఆడి జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలని భావించాడు. మార్చిలో కరోనా రావడం, లీగ్​ నిరవధిక వాయిదా పడటం, టీ20 ప్రపంచకప్​ రద్దు.. ఇలా చాలానే అనుకోని సంఘటనలు జరిగాయి. దీంతో మహీ కెరీర్ సందిగ్ధంలో పడింది.

అయితే యూఏఈ వేదికగా సెప్టెంబర్​-నవంబర్​ మధ్య ఐపీఎల్​ నిర్వహణకు బీసీసీఐ గ్రీన్​సిగ్నల్​ ఇవ్వడం వల్ల ధోనీ మళ్లీ బ్యాట్​ పట్టనున్నాడు. ఈ లీగ్​ ప్రదర్శనతో టీమ్​ఇండియాలోకి రీఎంట్రీ ఇస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.

ధోనీ

ఇది చూడండి :మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో కరోనా హాకీ ప్లేయర్స్

ABOUT THE AUTHOR

...view details