తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమిండియా జోరు.. బంగ్లా ఆలౌట్.. భారత్​ 86/1

భారత్​-బంగ్లాదేశ్ మధ్య జరుగుతోన్న మొదటి టెస్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 86 పరుగులతో నిలిచింది టీమిండియా. అంతకు ముందు ప్రత్యర్థిని ఆలౌట్ చేసింది.

మ్యాచ్

By

Published : Nov 14, 2019, 5:20 PM IST

Updated : Nov 14, 2019, 5:25 PM IST

ఇండోర్​లో భారత్-బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు జరుగుతోంది. మొదటిరోజు ఆటముగిసే సమయానికి 86/1తో నిలిచింది టీమిండియా. అంతకు ముందు బంగ్లా.. 150 పరుగులకు ఆలౌటైంది.

దక్షిణాఫ్రికాతో సిరీస్​లో అదరగొట్టిన రోహిత్ శర్మ.. ఈ మ్యాచ్​లో 6 పరుగులకే ఔటయ్యాడు. మరో ఓపెనర్ మయాంక్​తో కలిసి పుజారా.. బంగ్లా బౌలర్లను సమర్థమంతంగా ఎదుర్కొన్నాడు. వీరిద్దరూ రెండో వికెట్​కు 72 పరుగులు జోడించారు. ప్రస్తుతం మయాంక్ అగర్వాల్ (37), పుజారా (43) పరుగులతో క్రీజులో ఉన్నారు.

భారత బౌలర్ల హవా

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్​కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 12 పరుగుల వద్ద ఓపెనర్ ఇమ్రుల్ కేయస్(6) వికెట్​ తీశాడు ఇషాంత్. కాసేపటికే మరో ఓపెనర్ ఇస్లామ్​ను(6) ఔట్ చేసి బంగ్లాను కష్టాల్లో పడేశాడు ఉమేశ్. క్రీజులో నిలదొక్కుకుంటున్న మిథున్​ను(13) ఎల్బీడబ్ల్యూ చేశాడు షమి.

అనంతరం కెప్టెన్ మోమినుల్ హక్(37) - ముష్ఫికర్ రహీమ్(43) జోడీ బంగ్లా ఇన్నింగ్స్​ను గాడిలో పెట్టే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. నిలకడగా ఆడుతున్న మోమినుల్​ను ఔట్ చేసి బంగ్లాను దెబ్బతీశాడు అశ్విన్. అక్కడి నుంచి బంగ్లా బ్యాట్స్​మెన్ వరుసగా పెవిలియన్​కు క్యూ కట్టారు. ఫలితంగా 150 పరుగులకే ఆలౌటైంది బంగ్లా.

భారత బౌలర్లలో షమి మూడు వికెట్లతో సత్తాచాటగా... ఇషాంత్, ఉమేశ్ యాదవ్, అశ్విన్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.

ఇవీ చూడండి.. దిల్లీకి రహానే.. రాజస్థాన్​ జట్టులోకి పృథ్వీషా!

Last Updated : Nov 14, 2019, 5:25 PM IST

ABOUT THE AUTHOR

...view details