తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీ-20: విండీస్​తో భారత్​ అమీతుమీ

వెస్టిండీస్​ పర్యటనలో భాగంగా శనివారం తొలి టీ-20 ఆడనుంది టీమిండియా. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్​ ప్రారంభం కానుంది.

టీ-20: విండీస్​తో భారత్​ అమీతుమీ

By

Published : Aug 3, 2019, 5:00 AM IST

Updated : Aug 3, 2019, 11:21 AM IST

ప్రపంచకప్​లో సెమీస్​ పరాభవం తర్వాత మైదానంలో తొలిసారి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతోంది టీమిండియా. వెస్టిండీస్​ పర్యటనలో భాగంగా ముందుగా టీ-20 సిరీస్​ ఆడనుంది. ఫ్లోరిడాలోని లాడర్​హిల్​ వేదికగా శనివారం విండీస్​తో తలపడనుంది.

ఈ సిరీస్​కు కోహ్లీ విశ్రాంతి తీసుకుంటాడని అందరూ అనుకున్నారు. కానీ పూర్తిస్థాయి జట్టుతోనే బరిలో దిగేందుకు సిద్ధమైంది భారత్. అయితే బుమ్రా టెస్టు సిరీస్​ మాత్రమే ఆడనున్నాడు. హార్దిక్​ పాండ్యకు ఈ పర్యటన మొత్తానికే విశ్రాంతినిచ్చారు.

గాయం నుంచి కోలుకున్న శిఖర్​ ధావన్.. రోహిత్​ శర్మతో కలిసి ఇన్నింగ్స్​ ప్రారంభించనున్నాడు. రాహుల్ నాలుగో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. టీమిండియా భవిష్యత్తు వికెట్​ కీపర్​గా పేరొందిన రిషభ్ పంత్.. ఈ పర్యటన​లో ఏ మేరకు​ రాణిస్తాడో చూడాలి.

చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన మనీశ్​ పాండే, శ్రేయస్​ అయ్యర్​ ప్రదర్శనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం మిడిలార్డర్​ సమస్యతో బాధపడుతున్న టీమిండియాకు వీరి ప్రదర్శన కీలకం. ఇటీవలే భారత్-ఏ జట్టు తరఫున కరీబియన్​ పర్యటనకు వెళ్లిన వీరిద్దరూ మంచి ఆటతో ఆకట్టుకున్నారు.

బౌలింగ్ విభాగంలో వాషింగ్టన్ సుందర్, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్.. పొట్టి ఫార్మాట్​ జట్టులోకి పునరాగమం చేశారు. వీరితో పాటే యువ పేసర్ నవదీప్​ సైనీ, రాహుల్ చాహర్ టీమిండియా తరఫున టీ-20ల్లో అరంగేట్రం చేయనున్నారు.

పొట్టి ఫార్మాట్​లో ప్రమాదకారి వెస్టిండీస్​. కీరన్ పొలార్డ్, సునీల్​ నరైన్ రాకతో ఇప్పుడు మరింత బలం పుంజుకుంది. ఇప్పటికే టీ-20ల్లో తామెంటో నిరూపించుకున్న వీరిద్దరూ ఈ మ్యాచ్​లో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టేందుకు సమాయత్తమవుతున్నారు. మిగతా సభ్యులు తమ వంతు పాత్ర పోషించేందుకు సిద్ధమవుతన్నారు.

జట్లు(అంచనా)

టీమిండియా:రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), కేఎల్ రాహుల్, మనీశ్​ పాండే, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, నవదీపై సైనీ

వెస్టిండీస్: జాన్ కాంప్​బెల్, ఎవిన్ లూయిస్, హెట్మయిర్, నికోలస్ పూరన్, కీరన్ పొలార్డ్, కార్లోస్​ బ్రాత్​వైట్(కెప్టెన్), సునీల్ నరైన్, షెల్డన్ కాట్రెల్, ఒషానో థామస్, ఆండ్రీ రసెల్, కీమో పాల్

Last Updated : Aug 3, 2019, 11:21 AM IST

ABOUT THE AUTHOR

...view details