ముక్కోణపు సిరీస్‌లో భాగంగాభారత్-ఇంగ్లాండ్ మహిళా జట్ల మధ్య జరిగిన టీ20లో టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలిచింది. హర్మన్‌ప్రీత్ కౌర్(42) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని తెచ్చిపెట్టింది. ఇంగ్లీష్ జట్టు నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని మూడు బంతులు మిగిలుండగానే ఛేదించింది మహిళా భారత్.
హర్మన్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్‌పై భారత్ విజయం - భారత్-ఇంగ్లాండ్ టీ20
ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత మహిళా జట్టు విజయం సాధించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ గెలుపులో కీలక పాత్ర పోషించింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లీష్ జట్టులో కెప్టెన్ నైట్(67) మాత్రమే రాణించింది. మిగతా బ్యాట్స్ ఉమెన్ స్వల్పస్కోర్లకే వెనుదిరిగారు. భారత బౌలర్లు రాజేశ్వరి(2/19), దీప్తి శర్మ(2/30), రాధా యాదవ్(1/33) ధాటికి నిర్ణీత ఓవర్లలో 147 పరుగులే చేశారు.
అనంతరం ఛేదనలో భారత్.. నెమ్మదిగానే ఇన్నింగ్స్ ప్రారంభించింది. స్మృతి మంధాన 15, షెఫాలీ వర్మ 30, జెమీమా 26 పరుగులు చేసి వెనుదిరిగారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మాత్రమే క్రీజులో నిలబడి ఒంటరి పోరాటం చేసి, జట్టుకు విజయాన్నందించింది. మిగతా వారిలో వేదా 7, తాన్య భాటియా 11, దీప్తి శర్మ 12 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో కేథరిన్ 2 వికెట్లు తీయగా, సోఫీ, స్కీవర్, నైట్ తలో వికెట్ పడగొట్టారు.