తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీ20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ - cricket latest news

నిర్ణయాత్మక మూడో టీ20లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. నాగ్​పుర్​లో జరుగుతోందీ మ్యాచ్​.

బంగ్లాదేశ్

By

Published : Nov 10, 2019, 6:37 PM IST

నాగ్​పుర్ వేదికగా జరుగుతోన్న భారత్-బంగ్లాదేశ్​ చివరి టీ20లో టాస్​ బంగ్లాదేశ్ గెలిచింది. టీమిండియా​కు బ్యాటింగ్ అప్పగించింది. ఈ మ్యాచ్​ గెలిచి సిరీస్​ను సొంతం చేసుకోవాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. ఇప్పటికే తీవ్ర కసరత్తులు చేశాయి.

రోహిత్ శర్మ ఫామ్‌లోకి రావడం, శ్రేయస్ అయ్యర్ రాణిస్తుండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. ధావన్, పంత్‌ ఆటతీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. రాహుల్‌, కృనాల్‌ పాండ్యలు స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది.

జట్లు

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, లోకేశ్ రాహుల్, రిషభ్ పంత్, దీపక్ చాహర్, చాహల్, శివమ్ దూబే, మనీశ్ పాండే, శార్దుల్ ఠాకుర్, వాషింగ్టన్ సుందర్

బంగ్లాదేశ్: ముష్ఫీకర్ రహీమ్, మహ్మదుల్లా(కెప్టెన్), షైఫుల్​ ఇస్లాం, సౌమ్య సర్కార్, అల్ అమీన్ హుస్సేన్, లిట్టన్ దాస్, మొసద్దీక్ హుస్సేన్, ముస్తాఫీజుర్ రెహ్మాన్, అఫిఫ్ హుస్సేన్, అమీనుల్ ఇస్లాం, మహ్మద్ నయీమ్

ABOUT THE AUTHOR

...view details