బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాట్స్‌మెన్ నిలకడగా ఆడుతున్నారు. ఇండోర్ వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ప్రస్తుతం క్రీజులో మయాంక్ అగర్వాల్(91*), రహానే(35*) ఉన్నారు. వీరిద్దరూ 69 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు.
నిలకడగా భారత్ బ్యాటింగ్.. సెంచరీకి చేరువలో మయాంక్ - ind v ban
బంగ్లాదేశ్‌తో తొలిటెస్టు రెండో రోజు లంచ్ విరామానికి 188/3తో నిలిచింది టీమిండియా. క్రీజులో మయాంక్, రహానే ఉన్నారు.
భారత్-బంగ్లాదేశ్ తొలి టెస్టు
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ(0) ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన రహానే.. ఓపెనర్ మయాంక్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను సరిదిద్దుతున్నాడు.
అంతకు ముందు తొలిరోజు మ్యాచ్‌లో 150 పరుగులకే ఆలౌట్ అయింది బంగ్లాదేశ్. షమి మూడు వికెట్లు తీశాడు. అశ్విన్, ఉమేశ్, ఇషాంత్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.