తెలంగాణ

telangana

ETV Bharat / sports

టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. భారత్ బౌలింగ్ - INDIA-BANGLADESH DAY AND NIGHT TEST MATCH TOSS

పింక్ బాల్​ టెస్టులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈడెన్ గార్డెన్స్​లో భారత్​తో జరుగుతున్న ఈ మ్యాచ్​ను తొలిసారిగా డే/నైట్​ పద్ధతిలో నిర్వహిస్తున్నారు.

భారత్-బంగ్లాదేశ్ పింక్ బాల్ టెస్టు

By

Published : Nov 22, 2019, 12:34 PM IST

ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్​తో జరుగుతోన్న తొలి డే/నైట్​ టెస్టులో టాస్ బంగ్లాదేశ్​ను వరించింది. కెప్టెన్ మొమినుల్ హక్.. బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇరుజట్లు గులాబి బంతితో టెస్టు మ్యాచ్ తొలిసారిగా​ ఆడనున్నాయి. మొదటిరోజు ఎవరు అధిక్యం చూపిస్తారో చూడాలి.

సొంతగడ్డపై టెస్టుల్లో జైత్రయాత్ర సాగిస్తున్న కోహ్లీసేన... ఈ మ్యాచ్​లోనూ గెలిచి మరో సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే 11 టెస్టు సిరీస్​లను ఖాతాలో వేసుకుంది భారత్.

పింక్​బాల్​తో ప్రాక్టీసు చేస్తున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ

జట్లు

భారత్

విరాట్​ కోహ్లీ(కెప్టెన్​), రోహిత్​శర్మ, మయాంక్​ అగర్వాల్​, చతేశ్వర్​ పుజారా, అజింక్య రహానే, వృద్ధిమాన్​ సాహా(కీపర్​), రవిచంద్రన్​ అశ్విన్​, రవీంద్ర జడేజా, షమి, ఇషాంత్​ శర్మ, ఉమేశ్​ యాదవ్​

బంగ్లాదేశ్

మోమినుల్​ హక్​(కెప్టెన్​), లిటన్​ దాస్​(కీపర్​), నయీమ్​ హసన్​, అల్​ అమిన్​ హొస్సేన్​, ఎబొడాట్​ హొస్సేన్​, షాద్​మన్​ ఇస్లామ్​, అబు జాయేద్​, ఇమ్రుల్​ కేయిస్​, మహ్మదుల్లా, మహ్మద్​ మిథున్​, ముష్ఫీకర్​ రహీమ్​

ABOUT THE AUTHOR

...view details