మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది మహిళా టీ20 ప్రపంచకప్. ఆస్ట్రేలియాలో ఈ టోర్నీ 17 రోజుల పాటు జరగనుంది. ఈ విషయం తనకు గర్వంగా ఉందన్నాడు ఆసీస్ మాజీ బౌలర్ బ్రెట్ లీ. ఇందులో ఆస్ట్రేలియా, టీమిండియా మేటి జట్లని అభిప్రాయం వ్యక్తం చేశాడు. వీటితో పాటే మరిన్ని విషయాల్ని పంచుకున్నాడు.
"మహిళల టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియాలో నిర్వహిస్తుండటం గర్వంగా ఉంది. ఆస్ట్రేలియా, భారత జట్లు ఈ టోర్నీని మరో స్థాయికి చేరుస్తాయని అనుకుంటున్నా. ఈ రెండు జట్ల మధ్య మొదటి మ్యాచ్ ఉండటం ఆసక్తి కలిగిస్తుంది. టీమిండియా.. హర్మన్‌ప్రీత్, స్మృతి మంధాన, షెఫాలీ వర్మ వంటి బ్యాట్స్ఉమెన్తో దృఢంగా ఉంది. కాబట్టి ఆ జట్టు ఆటతీరుపై కన్నేసి ఉంచాలి. ఎప్పటికప్పుడు వారిని గమనించాలి"
- బ్రెట్ లీ, ఆసీస్ మాజీ బౌలర్