తెలంగాణ

telangana

ETV Bharat / sports

చెలరేగిన ఆసీస్...సిరీస్​2-2తో సమం. - ఆస్ట్రేలియా

359 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆసిస్​ 4 వికెట్ల తేడాతో నెగ్గింది. మొహాలీలో జరిగిన నాలుగో వన్డేలో భారత్​ బ్యాటింగ్​లో రాణించినా...బౌలింగ్, ఫీల్డింగ్​లో ఘోరంగా విఫలమైంది. ఫలితంగా ఈ స్టేడియంలో భారీ స్కోరు ఛేదించిన జట్టుగా ఆస్ట్రేలియా రికార్డు సృష్టించింది. సిరీస్​నూ​ 2-2తో సమం చేసి..తుది పోరుకు సిద్ధమవుతోంది.

ఆరంభం ఆచితూచి...ఆఖర్లో చెలరేగి

By

Published : Mar 10, 2019, 10:18 PM IST

గెలిస్తేనే సిరీస్​ ఆశలు సజీవంగా ఉంటాయనే​ మ్యాచ్​లో ఆసిస్​ దుమ్ములేపింది. కంగారుల జట్టు బ్యాట్స్​మెన్​ పీటర్ హ్యాండ్స్​కోంబ్​ శతకంతో ఆటను లాక్కొస్తే...చివర్లో టర్నర్​ సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ఫలితంగా 2-2తో సిరీస్​ సమమైంది. చివరి మ్యాచ్​ ఈ నెల 13న దిల్లీలో జరగనుంది. ​మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​ ట్రోఫీ టర్నర్​ అందుకున్నాడు.

    • ఆదిలో ఆట స్లో...

    భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్​కు ఆదిలోనే ఎదురుబెబ్బ తగిలింది. తొలి ఓవర్లోనే కెప్టెన్ ఫించ్​ను భువనేశ్వర్​ క్లీన్ బౌల్డ్ చేశాడు. షాన్ మార్ష్ కూడా తక్కువ పరుగులకే ఔటయ్యాడు. 12 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది ఆసిస్. అనంతరం ఖవాజా, హాండ్స్ కోంబ్ తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. ఇద్దరూ ఆచితూచి ఆడుతూ అర్ధశతకాలు సాధించారు. 105 బంతుల్లో 117 పరుగులు చేసిన హ్యాండ్స్​కోంబ్​ విజయంపై ఆశలు నిలిపాడు.

    • బంతి పడితే అవతలకే...

    విధ్వంసకర బ్యాట్స్​మెన్​ మ్యాక్స్​వెల్​ 23 పరుగులకే ఔటయ్యాడు. ఇక భారత్​ గెలుస్తుందని అంతా అనుకున్నారు. అప్పుడు క్రీజులోకి అడుగుపెట్టిన టర్నర్​ 43 బంతుల్లో 84 పరుగులు(5 ఫోర్లు,6 సిక్సులు)తో చివరివరకు పాతుకుపోయాడు. బౌలర్​తో పనిలేకుండా, ఫీల్డర్లకు పనిచెప్పకుండా బంతితో ఓ ఆట ఆడేసుకున్నాడు. ఈ ఆటగాడి దెబ్బకు 359 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి 47.5 ఓవర్లలోనే ఛేదించేసింది ఆస్ట్రేలియా.

    • ఓపెనింగ్ అదిరే..

    వరుసగా మూడు మ్యచ్​ల్లో విఫలమై విమర్శలు ఎదుర్కొన్న ధావన్, రోహిత్ ఈ వన్డేలో ఆచితూచి ఆడారు. సింగిల్స్​కి ప్రాధాన్యం ఇస్తూనే చెత్త బంతుల్ని బౌండరీకి తరలించారు. ఈ క్రమంలో ఇద్దరూ తమ అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు. అనంతరం ధాటిగా ఆడిన వీరిద్దరూ ఫోర్లు, సిక్సర్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. భారీ షాట్ ఆడబోయి 95 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ ఔటయ్యాడు. దీంతో 193 పరుగులు భాగస్వామ్యానికి తెరపడింది. ఆసీస్​పై భారత్​కు ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం.

    ఇదే క్రమంలో ధావన్ తన 16వ వన్డే శతకాన్ని నమోదు చేసుకున్నాడు. 143 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కమిన్స్ బౌలింగ్లో ఔటయ్యాడు. వన్డేల్లో శిఖర్​కు ఇవే అత్యధిక పరుగులు కావడం విశేషం. కోహ్లీ (7) రాహుల్ (26), జాదవ్ (10) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. ప్రపంచకప్ జట్టులో చోటు కోసం ప్రయత్నిస్తున్న పంత్ 24 బంతుల్లో 34 పరుగులు చేసి ఔటయ్యాడు. విజయ్ శంకర్ 26 పరుగులు చేశాడు.

    • ఆస్ట్రేలియా బౌలర్లు ఈ మ్యాచ్​లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. కమిన్స్ 5 వికెట్లు తీసి ఆకట్టుకోగా జ్యే రిచర్డ్ సన్ మూడు, జంపా ఒక వికెట్ తీసుకున్నారు.

    ABOUT THE AUTHOR

    ...view details