తెలంగాణ

telangana

ETV Bharat / sports

న్యూజిలాండ్​తో టెస్టు సిరీస్​కూ హార్దిక్ దూరం - Hardik Pandya ruled out of New Zealand Test series

న్యూజిలాండ్​తో టీ20, వన్డే సిరీస్​లకు ఫిట్​నెస్ లేని కారణంగా ఇప్పటికే దూరమయ్యాడు హార్దిక్ పాండ్య. ఇదే కారణంతో ఇప్పుడు టెస్టు జట్టులోనూ చోటు కోల్పోయాడు.

హార్దిక్
హార్దిక్

By

Published : Feb 1, 2020, 2:58 PM IST

Updated : Feb 28, 2020, 6:49 PM IST

ప్రస్తుతం న్యూజిలాండ్​తో టీ20 సిరీస్​ ఆడుతుంది టీమిండియా. ఐదు మ్యాచ్​ల సిరీస్​లో ఇప్పటికే 4-0 తేడాతో ఆధిక్యంలో నిలిచి, అదరగొడుతోంది. తర్వాత మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఇప్పటికే వన్డే జట్టును ప్రకటించిన సెలక్టర్లు.. టెస్టులకూ ఆటగాళ్ల పేర్లను ప్రకటించనున్నారు. ఇప్పటికే టీ20లు, వన్డేలకు దూరమైన ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య.. ఫిట్​నెస్​ లోపం కారణంగా సుదీర్ఘ ఫార్మాట్​ మ్యాచ్​లకూ దూరమయ్యాడు.

హార్దిక్.. గతేడాది సెప్టెంబర్ నుంచి గాయం కారణంగా వరుస సిరీస్​లకు దూరమయ్యాడు. లండన్​లో సర్జరీ చేయించుకున్న ఇతడు.. న్యూజిలాండ్ పర్యటనకు అందుబాటులోకి వస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఫిట్​నెస్ లేని​ కారణంగా టీ20, వన్డే జట్లలో ఇతడి పేరును ప్రకటించలేదు సెలక్టర్లు. మరోసారి ఇదే కారణం వల్ల టెస్టు జట్టులోనూ చోటు కోల్పోయాడు.

ఇవీ చూడండి.. 'అప్పుడు ధోనీ.. ఇప్పుడు కోహ్లీ.. అలా చేయడం మంచిది కాదు'

Last Updated : Feb 28, 2020, 6:49 PM IST

ABOUT THE AUTHOR

...view details