తెలంగాణ

telangana

By

Published : Feb 25, 2021, 4:15 PM IST

Updated : Feb 25, 2021, 4:35 PM IST

ETV Bharat / sports

రూట్​కు 5 వికెట్లు.. 145 పరుగులకు భారత్​ ఆలౌట్​

అహ్మదాబాద్ టెస్టులో భారత్​ 145 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాట్స్​మెన్లలో 66 పరుగులు చేసిన రోహిత్​ శర్మ జట్టు టాప్​ స్కోరర్​. ఇంగ్లాండ్​ బౌలర్లలో రూట్ 5, లీచ్​ 4 వికెట్లు తీసుకున్నారు.​

india all out in third test first innings
రూట్​కు 5 వికెట్లు.. 145కే భారత్​ ఆలౌట్​

అహ్మదాబాద్​ డే/నైట్​ టెస్టు తొలి ఇన్నింగ్స్​లో భారత్​ 145 పరుగులకు ఆలౌటైంది. ఓవర్​నైట్​ స్కోర్​ 99/3తో రెండోరోజు ఆట మొదలు పెట్టిన టీమ్​ఇండియా.. త్వరత్వరగా వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్​ తొలి ఇన్నింగ్స్​ స్కోరు కంటే కోహ్లీ సేన 33 పరుగుల ఆధిక్యంలో ఉంది. 66 పరుగులు చేసిన రోహిత్​ శర్మ జట్టు టాప్​ స్కోరర్​. ఇంగ్లాండ్​ బౌలర్లలో రూట్ 5, లీచ్​ 4 వికెట్లు తీసుకున్నారు.​

ఆట మొదలైన కాసేపటికే 114 పరుగుల వద్ద ఆజింక్య రహానెను.. లీచ్​ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. స్కోరు బోర్డులో మరో పరుగు జోడించాక రోహిత్​ శర్మను కూడా లీచ్​ ఎల్బీగా పెవిలియన్​కు పంపాడు.

ఆ తర్వాత 42వ ఓవర్​లో బంతి అందుకున్న ఇంగ్లాండ్​ కెప్టెన్​ రూట్​.. రిషభ్​ పంత్​ను కీపర్​ క్యాచ్​గా వెనక్కి పంపాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్​ సుందర్​నూ.. రూట్​ క్లీన్​ బౌల్డ్​గా ఔట్​ చేశాడు. తదుపరి వచ్చిన అక్షర్​ కూడా అతనికే చిక్కాడు.

తర్వాత బ్యాటింగ్​కు వచ్చిన అశ్విన్​ ధాటిగా ఆడే క్రమంలో.. ఓ భారీ షాట్​కు యత్నించి క్యాచ్​ ఔటయ్యాడు.

స్పిన్​కు సహకరిస్తున్న మొతేరా పిచ్​పై ఇరు జట్ల స్పిన్నర్లు 18 వికెట్లు పడగొట్టారు. పేసర్లకు కేవలం రెండు వికెట్లు మాత్రమే దక్కాయి. రెండు జట్ల తొలి ఇన్నింగ్స్​ల్లో మొత్తం 8 మంది బ్యాట్స్​మెన్లు ఎల్బీగా వెనుదిరగడం విశేషం.

ఇదీ చదవండి:ప్రపంచకప్​ మ్యాచ్​ల లైవ్​ కోసం ఐసీసీ భారీ డీల్​

Last Updated : Feb 25, 2021, 4:35 PM IST

ABOUT THE AUTHOR

...view details