తెలంగాణ

telangana

ETV Bharat / sports

తొలి ఇన్నింగ్స్​లో భారత్ 297 పరుగులకు ఆలౌట్​

ఆంటిగ్వా వేదికగా వెస్టిండీస్​తో జరుగుతోన్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్​లో భారత్ 297 పరుగులకు ఆలౌటైంది. రహానే(81), జడేజా(58) అర్ధశతకాలతో ఆకట్టుకుని జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. విండీస్ బౌలర్లలో కీమర్ రోచ్ 4, గాబ్రియేల్ 3 వికెట్లతో ఆకట్టుకున్నారు.

భారత్​

By

Published : Aug 23, 2019, 9:49 PM IST

Updated : Sep 28, 2019, 1:02 AM IST

వెస్టిండీస్​తో జరుగుతోన్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్​లో భారత్297​ పరుగులకు ఆలౌటైంది. ఓవర్​నైట్​ స్కోరు 203/6 పరుగుల వద్ద రెండో రోజు ఆట మొదలు పెట్టిన టీమిండియా మరో 94 పరుగులు జత చేసింది. రహానే(81), రవీంద్ర జడేజా(58) అర్ధశతకాలతో ఆకట్టుకుని భారత్​కు గౌరవప్రదమైన స్కోరు అందింంచారు. విండీస్ బౌలర్లు కీమర్ రోచ్ 4, గ్రాబియేల్ 3, చేజ్ రెండు వికెట్లతో రాణించారు.

టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన టీమిండియా టాపార్డర్ విఫలమైంది. ఫలితంగా 25పరుగులకే మూడు వికట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇలాంటి పరిస్థితుల్లో అజింక్యా రహానే అర్ధశతకంతో ఆకట్టుకుని భారత జట్టు ఇన్నింగ్స్​ను గాడిలో పెట్టాడు. 81 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గాబ్రియేల్ బౌలింగ్​లో ఔట్ అయ్యాడు.

అజింక్యా రహానే

203/3 పరుగుల ఓవర్​ నైట్​ స్కోరు వద్ద రెండోరోజు ఆట మొదలు పెట్టిన కోహ్లీసేన ఆరంభంలోనే పంత్(24) వికెట్ చేజార్చుకుంది. అనంతరం రవీంద్ర జడేజా.. టెయిలెండర్లతో ఇన్నింగ్స్​ను ముందుకు నడిపించాడు. ముఖ్యంగా ఇషాంత్ శర్మతో(19) కలిసి 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 112 బంతుల్లో 58 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు జడ్డూ.

ఇది చదవండి: కోచ్​ కాలేకపోయినా కీలక పదవి పొందాడు!

Last Updated : Sep 28, 2019, 1:02 AM IST

ABOUT THE AUTHOR

...view details