శ్రీలంక మాజీ క్రికెటర్ దిల్హారా లోకుహెట్టిగే మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో దోషిగా తేలాడు. ఐసీసీ అవినీతి నిరోధక కోడ్ ప్రకారం అతడిని మూడు నిబంధనలను ఉల్లంఘించినట్టు స్వతంత్ర ట్రైబ్యునల్ గురువారం నిర్ధరించింది.
మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో దోషిగా లంక మాజీ క్రికెటర్ - దిల్హారా లోకుహెట్టిగే
మ్యాచ్‌ఫిక్సింగ్ కేసులో శ్రీలంక మాజీ క్రికెటర్ దిల్హారా లోకుహెట్టిగా దోషిగా తేలాడు. ఈ మేరకు ఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది.
అవినీతి కేసులో దోషిగా లంక మాజీ క్రికెటర్
2019 నవంబర్‌లో లోకుహెట్టిగేపై ఈ కేసు నమోదైంది. 2017లో యూఏఈలో జరిగిన టీ20 టోర్నమెంట్లో అతడు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు విచారణ చేపట్టిన స్వతంత్ర ట్రిబ్యునల్ అతడిని దోషిగా తేల్చినట్లు గురువారం ఐసీసీ ప్రకటన విడుదల చేసింది.