వెస్టిండీస్ ఓపెనర్ షై హోప్ సరికొత్త రికార్డు సృష్టించాడు. కటక్ వేదికగా జరుగుతోన్న రెండో వన్డేలో 50 బంతుల్లో 42 పరుగులు చేశాడీ కరీబియన్ ఆటగాడు. ఈ క్రమంలో వన్డే ఫార్మాట్‌లో మూడు వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. మొత్తంగా ఈ ఘనతను వేగంగా సాధించిన రెండో బ్యాట్స్‌మన్‌గా పేరు తెచ్చుకున్నాడు.
దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ హషీమ్ ఆమ్లా 3వేల పరుగుల మార్కును 57 ఇన్నింగ్స్‌ల్లో అందుకుని అగ్రస్థానంలో ఉన్నాడు. హోప్ 67వ వన్డేలో ఈ రికార్డు సాధించాడు. వెస్టిండీస్ తరఫున వన్డేల్లో మూడు వేల పరుగులు సాధించిన 12వ ఆటగాడిగా, వేగంగా సాధించిన తొలి కరీబియన్ క్రికెటర్‌గా హోప్ నిలిచాడు. ఈ ప్రదర్శనతో పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ బాబర్ అజామ్(68), వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ వివ్ రిచర్డ్స్(69)లను వెనక్కి నెట్టాడు.
ఇది మిస్సైంది...
ఒక క్యాలెండర్ ఇయర్‌లో వెస్టిండీస్ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచే రికార్డును హోప్ తృటిలో కోల్పోయాడు. విండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారా 1993లో 1349 పరుగులు సాధించాడు. ఇదే ఇప్పటివరకు విండీస్ తరఫున రికార్డు. దాన్ని అందుకోవడంలో హోప్ నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. విండీస్ తరఫున ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక వన్డే పరుగులు సాధించిన జాబితాలో లారా, హోప్‌ల తర్వాత డేస్మాండ్ హేన్స్(1232), వివ్ రిచర్డ్స్(1231), క్రిస్ గేల్(1217)లు వరుసగా ఉన్నారు.
రోహిత్‌తో పోటీ పడినా...
ఈ ఏడాది అత్యధిక వన్డే పరుగులు సాధించిన జాబితాలో రోహిత్ శర్మ అగ్ర స్థానంలో ఉన్నాడు. భారత్‌తో రెండో వన్డేలో కోహ్లీని దాటేసిన హోప్.. టాప్ కోసం రోహిత్‌తో పోటీ పడ్డాడు. కానీ రెండో స్థానంతోనే సరిపెట్టుకున్నాడు. అగ్రస్థానం కోసం రోహిత్‌శర్మ, కోహ్లీ మధ్య పోరు కొనసాగుతోంది.