భారత్‌తో జరుగుతోన్న తొలి టీ20లో కివీస్ బ్యాట్స్‌మెన్ అదరగొట్టారు. నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేశారు. టాస్ ఓడి, బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు శుభారంభానిచ్చారు. తొలి వికెట్‌కు మున్రో-గప్తిల్.. 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం గప్తిల్ (30) పెవిలియన్ చేరాడు. బౌండరీ లైన్ వద్ద రోహిత్ పట్టిన ఇతడి క్యాచ్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. మున్రో మాత్రం ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. 42 బంతుల్లో 59 పరుగులు చేసి ఔటయ్యాడు. గ్రాండ్‌హోమ్ (0) వెంటనే వెనుదిరిగాడు.
బాదేసిన కివీస్ బ్యాట్స్‌మెన్.. భారత్ లక్ష్యం 204 - IND vs Nz match
న్యూజిలాండ్-భారత్ మధ్య జరుగుతోన్న మొదటి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. నిర్ణీత ఓవర్లలో 203 పరుగులు చేసింది. కొలిన్ మున్రో, విలియమ్సన్, టేలర్ అర్ధశతకాలు చేశారు.
మ్యాచ్
అనంతరం సారథి విలియమ్సన్, టేలర్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలో విలియమ్సన్ అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. అనంతరం 51 పరుగుల వద్ద చాహల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. టేలర్ కూడా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 54 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 203 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా, చాహల్, దూబే, ఠాకుర్, జడేజా తలో వికెట్ తీశారు.
Last Updated : Feb 18, 2020, 5:44 AM IST