భారత్-న్యూజిలాండ్: కివీస్‌కు ఇదే రికార్డు ఛేజ్ - IND v NZ first ODI records
భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి వన్డేలో కివీస్ ఘనవిజయం సాధించింది. టీమిండియా విధించిన 348 పరుగుల లక్ష్యాన్ని 48.1 ఓవర్లలో ఛేదించింది. అయితే ఈ మ్యాచ్‌లో కొన్ని రికార్డులు నమోదయ్యాయి. వాటిపై ఓ లుక్కేయండి.
కివీస్
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా పరాజయం పాలైంది. భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచినా కాపాడుకోలేక ఓటమి చెందింది. టీ20ల్లో పూర్తిగా ఆధిపత్యం వహించిన కోహ్లీసేన వన్డే సిరీస్‌ను మాత్రం ఓటమితో ప్రారంభించింది. అయితే ఈ మ్యాచ్‌లో కొన్ని రికార్డులు నమోదయ్యాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.
- ఈ మ్యాచ్‌లో 348 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది న్యూజిలాండ్. వన్డేల్లో భారత్‌పై ఇది రెండో అత్యధిక ఛేజ్. 2019లో మొహాలీలో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 359 పరుగులను ఛేదించింది.
- ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు 24 వైడ్స్ వేశారు. వన్డేల్లో టీమిండియాకిది ఐదో చెత్త ప్రదర్శన. 1999లో కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో 31 వైడ్స్ వేశారు టీమిండియా బౌలర్లు.
- ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 84 పరుగులు సమర్పించుకున్నాడు. వన్డేల్లో ఇది మూడో చెత్త ప్రదర్శన. 2019లో ఇంగ్లాండ్‌పై 88 పరుగులు సమర్పించుకున్న చాహల్ మొదటి స్థానంలో ఉన్నాడు.
- ఈ మ్యాచ్‌లో నెంబర్ 4లో వచ్చిన శ్రేయస్ అయ్యర్, రాస్ టేలర్ ఇద్దరూ సెంచరీలు సాధించారు. ఇలా జరగడం ఇది మూడోసారి. 2007లో జింబాబ్వే ఆటగాడు తతెందా తైబూ (107), దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ (107) సెంచరీలు చేశారు. తర్వాత 2017లో ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లాండ్-102), యువరాజ్ సింగ్ (భారత్- 150) నాలుగులో బ్యాటింగ్‌కు వచ్చి శతకాలు బాదారు.
- ఈ మ్యాచ్‌లో టీమిండియా విధించిన 348 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 48.1 ఓవర్లలో ఛేదించింది. వన్డేల్లో ఆ జట్టుకు ఇదే అత్యధిక ఛేదన. 2007లో హామిల్టన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 347 పరుగులను ఛేదించింది.
Last Updated : Feb 29, 2020, 7:13 AM IST