తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్​తో టీ20 సిరీస్​కు ఆర్చర్​ దూరం! - జోఫ్రా ఆర్చర్

టీమ్​ఇండియాతో మార్చి 12 నుంచి జరగనున్న టీ20 సిరీస్​లో ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ జోఫ్రా ఆర్చర్​ ఆడేది సందేహంగానే మారింది. అతడు మోచేతి గాయంతో బాధపడుతున్నాడని.. సిరీస్​లో ఆడేది.. లేనిది త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కోచ్ సిల్వర్​వుడ్​ తెలిపాడు.

Ind vs Eng: Visitors sweating over Archer's availability in T20I series
భారత్​తో టీ20 సిరీస్​కు ఆర్చర్​ దూరం!

By

Published : Mar 8, 2021, 12:42 PM IST

భారత్​తో టీ20 సిరీస్​కు ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ జోఫ్రా ఆర్చర్​ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతడు మోచేతి గాయంతో బాధపడుతున్నాడని ప్రధాన కోచ్​ సిల్వర్​వుడ్​ తెలిపాడు. ఇటీవల జరిగిన టెస్టు సిరీస్​లోనూ మోచేతి గాయం కారణంగా రెండో, నాలుగో టెస్టుల్లో ఆర్చర్​ ఆడలేదు.

జోఫ్రా పరిస్థితిని వైద్య బృందం పర్యవేక్షిస్తుందని.. వైద్యుల సూచనల మేరకు త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని ఇంగ్లాండ్ ప్రధాన కోచ్​ క్రిస్ సిల్వర్​వుడ్​ తెలిపాడు.

ఆర్చర్ మోచేయి వద్ద కొంచెం మంటగా ఉంది. గాయం తీవ్రతను వైద్య బృందం సమీక్షిస్తుంది. అయినప్పటికీ.. ఈ రోజు ప్రాక్టీస్​ సెషన్​లో జోఫ్రా పాల్గొన్నాడు. అతని పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నాం. సిరీస్​కు అందుబాటులో ఉండేది.. లేనిది వెల్లడిస్తాం.

-క్రిస్​ సిల్వర్​వుడ్, ఇంగ్లాండ్​ ప్రధాన కోచ్.

ఇప్పటికే టెస్టు సిరీస్​ను కోల్పోయిన ఇంగ్లాండ్​.. ఇక పరిమిత ఓవర్ల సమరం కోసం సన్నద్ధం అవుతోంది. భారత్​తో జరగనున్న 5 మ్యాచ్​ల టీ20 సిరీస్ మార్చి 12 నుంచి ప్రారంభం అవుతుంది.

ఇదీ చదవండి:గ్రౌండ్​లోనే కాదు.. ఇక్కడా ఆడుతామంటున్న క్రికెటర్లు

ABOUT THE AUTHOR

...view details