అంతర్జాతీయ మ్యాచ్ ఏదైనా.. రికార్డులు నెలకొల్పడం టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అలవాటుగా మారింది. ఇంగ్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ నేడు ప్రారంభం కానున్న సందర్భంగా.. కోహ్లీని పలు రికార్డులు ఊరిస్తున్నాయి. అవేంటో మీరూ చూడండి.
- కోహ్లీ ఇంకొక సెంచరీ సాధిస్తే.. స్వదేశంలో అత్యధిక శతకాలు చేసిన సచిన్(20) సరసన చేరుతాడు. తెందుల్కర్‌ను దాటడానికి కోహ్లీకి కావాల్సిందే రెండు శతకాలే!
- మరో సెంచరీ చేస్తే.. మూడు ఫార్మాట్లలోనూ అత్యధిక అంతర్జాతీయ శతకాలు చేసిన కెప్టెన్‌గా కోహ్లీ సరికొత్త ఘనత సాధిస్తాడు. ప్రస్తుతం ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(41)తో సమానంగా ఉన్నాడు.
- వన్డేల్లో అత్యధిక శతకాలు బాదిన సారథిగా పాంటింగ్(22) తొలి స్థానంలో ఉన్నాడు.
- కోహ్లీ టెస్టుల్లో తన చివరి శతకాన్ని 2019 నవంబర్ 23న కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాపై డేనైట్ మ్యాచ్‌లో చేశాడు. ఇది జరిగి ఒక సంవత్సరం మీద 122 రోజులు గడిచింది. అదే వన్డేల్లో 2019 ఆగస్టు 11న వెస్టిండీస్‌పై చేశాడు. ఇది జరిగి ఒక సంవత్సరం మీద 222 రోజులు గడిచింది. కోహ్లీ కెరీర్లో సెంచరీల మధ్య ఇన్ని రోజుల వ్యవధి ఎప్పుడూ లేదు.