తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్-ఇంగ్లాండ్ టీ20: ఈ రికార్డులపై ఓ లుక్కేయండి! - భారత్-ఇంగ్లాండ్ టీ20 వార్తలు

ఇంగ్లాండ్​తో జరిగిన మూడో టీ20లో టీమ్ఇండియా ఓడిపోయింది. కోహ్లీ అర్ధసెంచరీతో మెరిసినా.. మిగతా బ్యాట్స్​మెన్ రాణించడంలో విఫలమయ్యారు. కాగా, ఈ మ్యాచ్​ ద్వారా నమోదైన పలు రికార్డులపై ఓ లుక్కేద్దాం.

kohli, morgan
కోహ్లీ, మోర్గాన్

By

Published : Mar 17, 2021, 11:15 AM IST

ఇంగ్లాండ్​తో జరిగిన మూడో టీ20లో ఓటమి చవిచూసింది టీమ్ఇండియా. కోహ్లీ 77 పరుగులతో అజేయంగా నిలిచినా మిగతా బ్యాట్స్​మెన్ నుంచి మద్దతు కరవైంది. ఫలితంగా 156 పరుగులకే పరిమితమైంది. 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బట్లర్ సెంచరీతో చెలరేగిపోయాడు. కాగా, ఈ మ్యాచ్​లో పలు రికార్డులు నమోదయ్యాయి. అవేంటో చూద్దాం.

  • విరాట్ కోహ్లీ అర్ధసెంచరీ చేసిన టీ20లో టీమ్ఇండియా ఓడిపోవడం ఇది ఎనిమిదోసారి. ఇప్పటివరకు టీ20ల్లో అర్ధసెంచరీ చేసినా.. జట్టు ఓడిపోయిన సందర్భాలు (8) దక్షిణాఫ్రికా ఆటగాడు డుప్లెసిస్ పేరు మీద ఉండగా.. తాజాగా ఈ రికార్డును సమం చేశాడు కోహ్లీ.
    కోహ్లీ
  • టీ20 ఫార్మాట్​లో టీమ్ఇండియాను 9సార్లు ఓడించింది ఇంగ్లాండ్. ఆస్ట్రేలియా కూడా 9సార్లు ఓడించింది.
  • అర్ధశతకంతో నాటౌట్​గా నిలవడంలో రికార్డు సృష్టించాడు కోహ్లీ. ఇప్పటివరకు ఇతడు 50సార్లు అర్ధశతకానికి పైగా పరుగులు సాధించి నాటౌట్​గా నిలిచాడు. సచిన్ తెందూల్కర్ 49సార్లు నాటౌట్​గా ఉన్న రికార్డును తిరగరాశాడు.
  • కోహ్లీ ఐదుసార్లు జట్టు ఆటగాళ్లు 30 పరుగులు చేయడంలో విఫలమైన సందర్భంలో 75కు పైగా స్కోర్ సాధించాడు. ఇంతకుముందు జయవర్దనే 4సార్లు ఈ ఘనత సాధించాడు.
  • టీ20ల్లో కెప్టెన్​గా కోహ్లీకి ఇది 11వ అర్ధసెంచరీ. కేన్ విలియమ్సన్​ కూడా 11 హాఫ్ సెంచరీలతో ఉన్నాడు. ఫించ్ 10, మోర్గాన్ 9 అర్ధశతకాలతో కొనసాగతున్నారు.
  • ఇంగ్లాండ్ కెప్టెన్​ ఇయాన్ మోర్గాన్​కు ఇది 100వ టీ20. ఆ దేశం తరఫున 100 టీ20లు ఆడిన మొదటి క్రికెటర్ మోర్గాన్ కావడం విశేషం.
    మోర్గాన్

ABOUT THE AUTHOR

...view details