ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకుని ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో చోటు దక్కించుకుంది టీమ్ఇండియా. ఈ సిరీస్‌కు ఇదొక్కటే హైలైట్ కాదు. ఐదేళ్లలో ఎక్కువ మంది వీక్షించిన టెస్టు సిరీస్‌గానూ రికార్డు సృష్టించిందీ సిరీస్. టెలివిజన్‌లో సగటున నిమిషానికి 1.3 మిలియన్ మంది ఈ మ్యాచ్‌ను చూడటం విశేషం. మొత్తంగా 103 మిలియన్ మంది ఈ సిరీస్ చూశారు.
బుల్లితెరపై భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ రికార్డు - బుల్లితెరపై భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ రికార్డు
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్టు సిరీస్ అత్యధిక వీక్షణలతో రికార్డు సృష్టించింది. ఈ సిరీస్‌ను మొత్తంగా 103 మిలియన్ల మంది చూశారు.
![బుల్లితెరపై భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ రికార్డు IND vs ENG Test](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11082065-482-11082065-1616213703398.jpg)
భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్
టెస్టు ఫార్మాట్ ఆదరణ తగ్గిపోతోన్న సమయంలో ఈ రికార్డు మరోసారి జెంటిల్మెన్ గేమ్ ప్రాముఖ్యాన్ని చాటిచెప్పింది. కాగా, భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగే వన్డే సిరీస్‌తో పాటు టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు ఇలాగే వ్యూస్ రావాలని ఆశిస్తోంది ప్రసారదారు.