తెలంగాణ

telangana

ETV Bharat / sports

' స్టోక్స్​ విధ్వంసకర బ్యాటింగ్​తో బౌలర్లు హడల్​' - జోస్ బట్లర్

ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ బెన్​ స్టోక్స్​పై ప్రశంసల జల్లు కురిపించాడు ఆ జట్టు తాత్కాలిక కెప్టెన్ జోస్ బట్లర్. గత కొద్ది కాలంగా స్టోక్స్​ బౌలర్లను బెంబెలెత్తిస్తున్నాడని చెప్పాడు. ఐపీఎల్​లోనూ ఇదే ఫాం కొనసాగించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు. వన్డే సిరీస్ అనంతరం ఐపీఎల్​ జట్టుతో చేరుతానని స్పష్టం చేశాడు.

Ind vs Eng: Stokes' batting has continued to improve over the last few years, says Buttler
'గత కొద్దికాలంగా స్టోక్స్​ బ్యాటింగ్​ మెరుగవుతుంది'

By

Published : Mar 27, 2021, 10:20 PM IST

టీమ్​ఇండియాతో రెండో వన్డేలో అద్భుత ప్రదర్శన చేసిన బెన్​ స్టోక్స్​పై ప్రశంసలు కురిపించాడు ఇంగ్లాండ్​ తాత్కాలిక కెప్టెన్ జోస్ బట్లర్​. స్టోక్స్​ గత కొద్ది కాలంగా అతడు బౌలర్లపై విరుచుకుపడుతున్నాడని చెప్పాడు.

"రెండో వన్డేలో స్టోక్స్​ ఆట చాలా బాగుంది. అతడి బ్యాటింగ్​ను ఎంజాయ్​ చేశాను. బెన్​ ప్రపంచకప్ ఫైనల్ ఇన్నింగ్స్ ప్రత్యేకమైనది. ఆ ఇన్నింగ్స్​ను నేను ఆస్వాదించాను. బెన్ ప్రతిభ మనందరికీ తెలుసు. గత కొన్నేళ్లుగా అతడి ఆటను గమనిస్తున్నా. బ్యాటింగ్​లో చాలా మార్పు వచ్చింది. అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ ఆటతీరు కనబరుస్తున్నాడు. అతనికి బౌలింగ్ చేయాలంటే బౌలర్లు భయపడుతున్నారు. ఇదే ఆట ఐపీఎల్​లోనూ కొనసాగుతుందని ఆశిస్తున్నా."

-జోస్ బట్లర్, ఇంగ్లాండ్ తాత్కాలిక కెప్టెన్.

టీ20ల్లో స్టోక్స్​ బ్యాటింగ్ ఆర్డర్​పై స్పందించాడు బట్లర్​. "అవును రెండో వన్డేలో మూడో స్థానంలో బ్యాటింగ్​కు వచ్చిన బెన్ అదరగొట్టాడు. ఈ స్థానంలో వచ్చిన క్రికెటర్లంతా దాదాపు అవకాశాలు అందిపుచ్చుకున్నారు. టీ20ల్లో ఈ స్థానంలో డేవిడ్ మలన్ ఉన్నాడు. పొట్టి ఫార్మాట్​లో అతడు నంబర్​ వన్ బ్యాట్స్​మెన్​ అనడంలో సందేహమే లేదు" అని బట్లర్ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్​ స్క్వాడ్​తో చేరడంపై స్పష్టత..

ఐపీఎల్​ 14వ సీజన్​ కోసం ముంబయికి చేరింది రాజస్థాన్​ రాయల్స్​ జట్టు. టీమ్​ఇండియాతో వన్డే సిరీస్​ ఆదివారంతో ముగుస్తుంది. సోమవారం నుంచి రాయల్స్​ స్క్వాడ్​తో చేరుతానని స్పష్టం చేశాడు బట్లర్​. ఈ ఏడాది భారత్​ వేదికగా పొట్టి ప్రపంచకప్​ ఉన్న నేపథ్యంలో.. ప్రస్తుత ఐపీఎల్​కు ఎంతో ప్రాముఖ్యత ఉందని అతడు వెల్లడించాడు. గతంలో ఎన్నో లీగ్​లు ఆడినప్పటికీ.. ప్రస్తుత టోర్నీ చాలా విలువైనదని తేల్చి చెప్పాడు.

ఇదీ చదవండి:ఆర్చర్​ మోచేతికి సర్జరీ.. ఈసీబీ స్పష్టం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details