చెపాక్ స్డేడియంలో జరుగుతోన్న రెండో టెస్టులో ఇంగ్లాండ్‌పై భారత బౌలర్లు విరుచుకుపడ్డారు. మూడో రోజు ఆటముగిసేసరికి ఇంగ్లీష్ జట్టు లక్ష్యానికి 429 పరుగుల వెనుకంజలో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో 19 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది.
రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌గా బరిలో దిగిన డొమినిక్ సిబ్లే.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో 8 ఓవర్లో 17 పరుగలు వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది ఇంగ్లీష్ జట్టు. అనంతరం వరుస ఓవర్లలో రెండు వికెట్లను చేజార్చుకుంది. అశ్విన్ బౌలింగ్‌లో 15.6 ఓవర్లో 49 పరుగులు వద్ద రోరీ బర్న్స్(25) రెండో వికెట్‌గా ఔట్ అయ్యాడు. షాట్‌కు యత్నంచి కోహ్లీ చేతికి చిక్కాడు. 16.6 ఓవర్లో అక్షర్ బౌలింగ్‌లో జాక్ లీచ్ ఒక్క పరుగు కూడా చేయకుండానే తొలి బంతికే రోహిత్ చేతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 50 పరుగులు వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది ప్రత్యర్థి జట్టు. ప్రస్తుతం క్రీజులో డేనియల్ లారెన్స్(19), జో రూట్(2) ఉన్నారు. భారత బౌలర్లలో అక్షర్(2), అశ్విన్ ఓ వికెట్‌ను దక్కించుకున్నారు.