భారత్‌తో తొలి రెండు టెస్టుల తర్వాతే ఇంగ్లాండ్ జట్టుతో బెయిర్‌స్టో కలుస్తాడని ఇంగ్లాండ్ , వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) స్పష్టం చేసింది. తొలుత నిర్ణయించిన ప్రణాళిక ప్రకారమే అతడు భారత్‌లో ఆడతాడని శుక్రవారం చెప్పింది. అంతకుముందు ఇంగ్లాండ్ బ్యాటింగ్ సహాయ కోచ్ గ్రాహమ్ తోర్ప్.. తొలి టెస్టు పూర్తి కాగానే బెయిర్‌స్టో తమ జట్టుతో కలిసి ఆడతాడని తెలిపారు. ఈ మేరకు ఈసీబీ వివరణ ఇచ్చింది.
తొలి రెండు టెస్టులకు స్టార్ బ్యాట్స్‌మెన్ బెయిర్ స్టోను పక్కన పెట్టడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తమ నిర్ణయం సరైందేనని మరోసారి చెప్పింది ఈసీబీ. ఆటగాళ్ల ఆరోగ్యం దృష్ట్యా ఇలాంటివి తప్పవని తెలిపింది.