టీమ్ఇండియాతో తొలి వన్డేలో ఓడిన ఇంగ్లాండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. గాయాలతో బాధపడుతున్న కెప్టెన్ మోర్గాన్, సామ్ బిల్లింగ్స్ రెండో మ్యాచ్‌లో ఆడేది అనుమానంగా కనిపిస్తోంది.
రెండో వన్డేకు ముందు ఇంగ్లాండ్‌కు ఎదురుదెబ్బ!
వన్డే సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టు గాయాల సమస్య వేధిస్తోంది. కెప్టెన్ మోర్గాన్‌తో పాటు సామ్ బిల్లింగ్స్.. రెండో వన్డేలో ఆడేది సందేహంగానే కనిపిస్తోంది.
ఇయాన్ మోర్గాన్
మోర్గాన్ బొటన, చూపుడు వేళ్ల మధ్యలో కుట్లు వేయాల్సి ఉండగా, భుజం ఎముక పట్టేయడం వల్ల బిల్లింగ్స్‌కు గాయపడ్డాడు. 48 గంటలు గడిస్తే గాని గాయాల తీవ్రత గురించి చెప్పలేనని మ్యాచ్ అనంతరం మోర్గాన్ చెప్పాడు.
పుణె వేదికగా మంగళవారం జరిగిన తొలి వన్డేలో ఇంగ్లాండ్ 66 పరుగుల తేడాతో ఓడిపోయింది. టీమ్ఇండియా బ్యాట్స్‌మన్ ధావన్, కోహ్లీ, కేఎల్ రాహుల్, కృనాల్ పాండ్య అర్ధ శతకాలతో ఆకట్టుకునే ప్రదర్శన చేసి జట్టుకు విజయాన్ని అందించారు.