అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న చివరి టెస్టులో భారత్ భోజన విరామ సమయానికి 4 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(32) ఉన్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్ రెండు వికెట్లు తీసుకున్నాడు.
కష్టాల్లో భారత్.. లంచ్ విరామానికి 80/4 - నరేంద్రమోదీ స్టేడియం
మొతేరా వేదికగా జరుగుతోన్న నాలుగో టెస్టులో లంచ్ సమయానికి భారత్.. నాలుగు వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. 32 పరుగులతో రోహిత్ క్రీజులో ఉన్నాడు.
ఓవర్‌నైట్ స్కోర్ 24/1తో రెండో రోజు ఆటను కొనసాగించిన టీమ్ఇండియాను.. లీచ్ ఆదిలోనే దెబ్బకొట్టాడు. క్రీజులో కుదురుకున్నట్లు కనిపించిన పుజారాను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. స్టోక్స్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన రహానె.. రోహిత్‌కు సహకారమందించాడు. అయితే లంచ్ విరామానికి ముందే రహానె వెనుదిరిగాడు. నాల్గో వికెట్‌కు ఈ జోడీ 39 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.
ఇదీ చదవండి:నాల్గో టెస్టుకు ఆర్చర్ దూరమైంది ఇందుకే...