తెలంగాణ

telangana

ETV Bharat / sports

'భారత్ సమష్టిగా ఆడబట్టే మాకు విజయం దక్కలేదు' - ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్

రెండో టీ20లో టీమ్​ఇండియా అద్భుత ప్రదర్శన చేసిందని అభిప్రాయపడ్డాడు ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్. జట్టుగా కోహ్లీ సేన గొప్పగా ఆడిందని పేర్కొన్నాడు.

Ind vs Eng: India came 'all guns blazing' in the match, says Morgan
'భారత్ సమష్టిగా ఆడబట్టే మాకు విజయం దక్కలేదు'

By

Published : Mar 15, 2021, 9:32 AM IST

అహ్మదాబాద్ వేదికగా జరిగిన రెండో టీ20లో భారత ఆటగాళ్లందరూ సమష్టి ప్రదర్శన చేశారని పేర్కొన్నాడు ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్. ఏదేమైనా టీమ్ఇండియా అద్భుతంగా ఆడిందని కొనియాడాడు.

"బ్యాటింగ్​ ఒక్కటే కాదు. జట్టుగా ఇండియా అద్భుత ప్రదర్శన చేసింది. ఆటగాళ్లందరూ గొప్పగా ఆడి.. మా నుంచి విజయాన్ని దూరం చేశారు. దీంతో మా బౌలర్లు కొంత ఒత్తిడికి లోనయ్యారు."

-ఇయాన్ మోర్గాన్, ఇంగ్లాండ్​ కెప్టెన్.

"ఈ ఏడాది భారత్​లో జరగనున్న టీ20 ప్రపంచకప్​కు ముందు ఈ సిరీస్​ ద్వారా మంచి ప్రాక్టీస్​ లభిస్తుంది. పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఇదే సరైన సమయం. మ్యాచ్​లు గెలిచినట్లయితే సానుకూల దృక్పథం అలవడుతుంది" అని మోర్గాన్ అభిప్రాయపడ్డాడు.

ఇదీ చదవండి:'అనుష్క, డివిలియర్స్​​ వల్లే తిరిగి గాడిలో పడ్డ'

ABOUT THE AUTHOR

...view details